
–జర్నలిస్టుల హక్కులకోసం రోడ్డె క్కిన టీయూడబ్ల్యూజే
— రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనలు, నిరసనలు
–33 జిల్లాల కలెక్టరు కార్యాలయా ల ముట్టడి సక్సెస్
— కొత్త జీవో 252 పేరుతో ఆక్రిడేషన్ల ను కుదించడంపై అల్లం ఆగ్రహం
Telangana Journalists Protest : ప్రజా దీవెన, హైదరాబాద్: “తెలం గాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు” అనే నినాదంతో ఉద్యమం చేసి, రా ష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి న తెలంగాణ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు రద్దు చేయడం పట్ల తెలంగాణ జర్నలిస్ట్ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త జీవో 252 పేరుతో ఆక్రిడేషన్లను కుదించ డం, డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను నిరాకరించడం పట్ల జర్న లిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అమలులో ఉన్న కార్డుల ను రద్దుచేసి వారి ఆత్మగౌరవాన్ని దె బ్బ తీయడంతో తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ – టి జె ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
జర్నలిస్టుల హక్కులను కాపాడేం దుకు రంగంలోకి దిగిన తెలంగాణ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యూ జె, టిజెఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 జి ల్లాలలో కలం కవాతు నిర్వహించి, కలెక్టరేట్లను ముట్టడించారు. తొలు త అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి ప త్రాలు ఇవ్వాలనే రాష్ట్ర కార్యవర్గ ని ర్ణయం మేరకు, ఆయా జిల్లాల జర్న లిస్ట్ సంఘాల నేతలు కలెక్టర్ కా ర్యాలయాలు చేరుకున్నారు. కాగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీ సులు, వారిని నిర్బంధించి జర్నలి స్టుల ప్రజాస్వామిక హక్కులను స్వే చ్ఛను అడ్డుకున్నారు. దాంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విన తిపత్రం ఇవ్వడానికి వెళ్లిన టి యు డబ్ల్యూజే రాష్ట్ర నేతలను పోలీసు లు లోపలికి అనుమతించకపోవ డంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టియుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జర్నలి స్టులు హైదరాబాద్ కలెక్టరు కార్యా లయం చేరుకున్నరు.వారిని పోలీ సులు అనుమతించలేదు.తమ భా వ ప్రకటనను, ప్రజాస్వామిక పద్ధ తులలో వినతి పత్రాన్ని ఇవ్వడానికి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ, కలెక్టర్ కార్యాలయం ఎదుట మారుతి సా గర్ నాయకత్వంలో జర్నలిస్టులు బై టాయించారు.
తమను కలెక్టర్ కార్యాలయం లోప లికి అనుమతించాలని డిమాండ్ చే శారు. అయినా పోలీసులు మొండి వైఖరితో నిరాకరించడంతో అక్కడే శాంతియుత పద్ధతులలో నినాదా లు చేశారు.” జర్నలిస్టులకు అక్రిడేష న్ కార్డులను రద్దు చేస్తారా.. సిగ్గు సి గ్గు..”. ‘ వీ వాంట్ జస్టిస్.’ “252 జీ వోను వెంటనే ఉపసంహరించుకో వాలి”.. అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంలో పోలీసులతో వాగ్వి వాదం జరిగింది.తమ స్వేచ్ఛను అ డ్డుకోవడం సరికాదని వాదించిన సంఘం నేతలను పోలీసులు అక్ర మంగా అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ” తెలంగాణ కోస మే తెలంగాణ జర్నలిస్టులు”.. “తె లంగాణ జర్నలిస్టుల హక్కులను కా పాడుకునేందుకు పోరాడుదాం పో రాడుదాం”.. “జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ.. నినాదాలు మి న్నంటాయి.జర్నలిస్టుల సంఘ నేత లు, మారుతి సాగర్, రమేష్ హ జా రి, రమణ కుమార్, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్, నవీన్ కుమార్, బాబూరావు, తదితరుల అక్రమ అరెస్టులను సంఘం అధ్య క్షుడు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్రంగా ఖండిం చారు.
కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల ఆక్రి డేషన్ లను కోత పెట్టడాన్ని నిరసి స్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కా ర్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన TUWJ TJF నేతలను అక్ర మంగా అరెస్టు చేయడాన్ని అధ్యక్షు లు అల్లం నారాయణ తప్పుబట్టా రు. జర్నలిస్టులను అరెస్టు చేయ డం దుర్మార్గమని, ఇటువంటి చర్య లు మానుకోకపోతే జర్నలిస్టులు పో రాటాన్నీ మరింత ఉదృతం చేస్తార ని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్టయిన సంఘం నేతలను పరా మర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ జర్నలిస్టులకు తీసుకున్న సంక్షేమ పథకాల గురించి వివరిం చారు. 42 కోట్ల నిధి జర్నలిస్టుల ని ధి ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తె లంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేసిఆర్ హయాంలో పెద్దపీట వేశారని, కొత్త ప్రభుత్వం అంతకంటే మెరుగైన కా ర్యక్రమాలు తీసుకుంటే సంతోషిస్తా మని అది కాకుండా జర్నలిస్టుల ఉ న్న గుర్తింపుని రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోపోమన్నారు.252 జీవో ను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఇప్ప టికైనా ముఖ్యమంత్రి , ఆశాఖ మం త్రి, వాస్తవాలు తెలుసుకొని జారీ చేసిన 252 జీవోను ఉపసంహ రిం చుకోవాలని, అందులోని అసంబ ద్ధమైన అంశాలు, లోప భూయిష్ట మైన విధానాలను సవరించుకో వా లని డిమాండ్ చేశారు.
డెస్క్ జర్నలిస్టులను రెండవ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ విడుదల చేసిన జీవోను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమన్నారు. నాడు తెలంగా ణ కోసం త్యాగాలు చేసిన జర్నలి స్టులందరినీ సమానంగా గౌరవించి, అందరికీ అక్రిడేషన్ కార్డులు కల్పిం చిన కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీ వో 239 స్ఫూర్తిని కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీ వోలో ఉన్న లోపాలను మీడియాకు ప్రస్తావించిన అల్లం నారాయణ పా త 239 జీవో తీసుకురావడంలో రా మచంద్రమూర్తి కమిటీదే కీలక పాత్ర అని చెప్పారు.నాటి ఆ కమిటీలో నే డు 252 జీవో కు కారణమైన ప్ర స్తు త మీడియా అకాడమీ చైర్మన్ శ్రీని వాస్ రెడ్డి, ఇంకా వారి సంఘాల నే తలు కూడా భాగస్వాములుగా ఉ న్నారని అన్నారు. ఆనాడు మాట్లా డని వాళ్ళు ఈనాడు తప్పులు ప ట్టడం ఎంతవరకు సబబు అని అ ల్లం నారాయణ ప్రశ్నించారు.
తెలంగాణ డెస్క్ జర్నలిస్టులు త మ హక్కుగా కొట్లాడి సాధించు కు న్న అక్రిడేషన్ కార్డును రద్దు చేయ డం అంటే, అది వారి గుర్తింపును, ఆత్మగౌరవాన్ని రద్దు చేయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం 252 జీవో పట్ల పునరాలోచన చేయకపోతే, భవిష్యత్తులో టీయూ డబ్ల్యూజే ఉద్యమ కార్యాచరణ ఉ దృతం చేస్తుందని ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ కొత్తగా తెచ్చి న 252 జీవోలో జర్నలిస్టులకు అవ కాశాలు పెంచాలి తప్ప కుదించడం ఏంటని ప్రశ్నించారు.పెద్ద పేపర్లు మీ డియం పేపర్లు ఇంకా వార్తా సేకర ణ లో కీలక భాగస్వాములైన జర్నలి స్టులకు అక్రిడేషన్లు కుదించడం అం టే వార్తా సేకరణను అడుక్కోవడ మేనన్నారు. తద్వారా పత్రికా స్వే చ్ఛను హరించడమేనని స్పష్టం చే శారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.
డెస్క్ జర్నలిస్టుల పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వైఖ రిని మారుతి సాగర్ దుయ్యబట్టా రు. తెలంగాణ ఉద్యమం చేసిన జర్నలిస్టులను మీరు పగబట్టడం న్యాయం కాదన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు జరుగుతున్న అ న్యా యాలను సవరించకపోతే, తమ ఉ ద్యమాన్ని ఉధృతం చేస్తామని హె చ్చరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షు లు రమేష్ హజారి మాట్లాడుతూ
అక్రిడేషన్ కార్డు అంటే జర్నలిస్టులో ఆత్మగౌరవాన్ని గుర్తించడమేనని అన్నారు. ఉన్న గుర్తింపు కార్డును ఊడగొట్టడం అంటే జర్నలిస్టులను గుర్తించ నిరాకరించడమేనని స్పష్టం చేశారు.తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టులను గుర్తింపును ర ద్దు చేయడమేనా నేటి ప్రజాపాలన విధానం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. ఏడవ ప్రజాస్వామిక హక్కును కాపాడుదామని మాట ఇచ్చిన రా ష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఏడిపి స్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించమని కోరితే రాజకీయం చేస్తు న్నారని., ఎదురు దాడి చేయడం స రైన పద్ధతి కాదని, ఇప్పటికైనా బేశ జాలకు పోకుండా జరిగిన పొరపా టును సరిదిద్దాలన్నారు. జర్నలి స్టు ల మనోగతాలను అర్థం చేసుకొని, పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు రుద్దకుండా,బాధ్యతాయుతంగా ఆలోచన చేసి జర్నలిస్టుల ఆత్మగౌ రవాన్ని దెబ్బతీయకుండా వారిని కించపరచకుండా వారి హక్కులను కాపాడాలని తెలిపారు.
జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఖజానాకు వాటిల్లే కోట్ల రూపాయల నష్టం ఏమీ లేదని హజారీ స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డు ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల కు వచ్చే లక్షల రూపాయల కాంట్రా క్టు లు ఏమి ఉండవని, ప్రభుత్వం కొండమీద కోతిని తీసుకొచ్చి ఇవ్వా ల్సిన అవసరం ఉండదని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు ద్వారా తమ కుటుంబాలకు ఒక భరోసా లభి స్తుందని ఉన్న అక్రిడేషన్ తీసేస్తే జ ర్నలిస్టులు అభద్రతాభావములో ప డిపోయి భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతారని, ఇది మంచి పరిణా మం కాదన్నారు.
ఏదైనా సంక్షేమ పథకం వస్తే అందు తుందేమో అని ఆశ తప్ప వేరే ఏమీ ఒరిగేది లేదన్నారు. ప్రభుత్వాలకు ఖర్చు లేని గుర్తింపునివ్వడానికి స మస్య ఏమిటో అర్థం కావట్లేదని హ జారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కా ర్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ మాట్లా డుతూ
మారిన కాలమాన పరిస్థితులలో ఫీల్డ్ జర్నలిస్టు డెస్క్ జర్నలిస్టు వారి వృత్తులు అటు ఇటుగా మారుతా ఉంటాయని తెలిపారు.
యాజమాన్యాలు ఒక జర్నలిస్టును ఏ విధంగానైనా వినియోగించుకునే పరిస్థితి నెలకొన్నది అన్నారు. ఇటువంటి పరిస్థితులలో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదన్నారు.
ఫీల్డ్ జర్నలిస్టు అని ఇంకొక అ డెస్క్ జర్నలిస్టు అని నిర్ధారించడం వలన వార్తా సేకరణ లో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు.
కోశాధికారి యోగానందం ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వారి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ జ ర్నలిస్టు వ్యతిరేక విధానాలక పై తీ వ్రంగా విమర్శ చేశారు. జర్నలిస్టుల మీద కుట్రలను ఇకనైనా స్వస్తి పలి కాలని ఎదుటి సంఘానికి హితవు పలికారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు అడిగితే రాజకీయాలు చేస్తు న్నానని సరికాదని మొదటి నుంచి పత్రికా రంగంలో రాజకీయాలు చే స్తున్నది ఎవరు అందరికీ తె లుసున ని, మీడియా రాజకీయాలు చేస్తు న్నది అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రె డ్డి మాత్రమేనని యోగానంద స్పష్టం చేశారు
*33 జిల్లాలలో మారుమోగిన క లం కవాతు* తెలంగాణ కోసమే తె లంగాణ జర్నలిస్టు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో సమన్వయం చేసి, రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించి న తెలంగాణ జర్నలిస్టులు… తమ అస్తిత్వ పరిరక్షణ కోసం, తమ గు ర్తింపు కోసం మరో పోరాటానికి దిగ డం నేటి ప్రజా పాలన దుస్థితిని తె లియజేస్తున్నది.
అందరి హక్కుల కోసం, సంక్షేమం కోసం వార్తలు రాసే జర్నలిస్టు తమ హక్కులను రక్షించడం కోసం రోడ్డు ఎక్కాల్సి రావడం బాధాకరం.
అక్రిడేషన్ పాలసీ పేరుతో రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొ చ్చిన జీవో నెంబర్ 252 వివాదా స్పదమైంది. డెస్క్ జర్నలిస్టుల అక్రి డేషన్ గుర్తింపును రద్దు చేయడం తో పాటు సగానికి సగం జర్నలిస్టు గుర్తింపు కార్డులను తొలగించడం వంటి అనేక లోపాలతో 252 జీవోలో పొందుపరచడం వల్ల జర్నలిస్టు సమాజానికి శాశ్వత నష్టం కలుగుతుందని గుర్తించారు.
ముఖ్యంగా జిల్లాల్లో మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతన జీవో అనేక రకాలుగా తమ హక్కు లను హరించి వేస్తున్నదనే ఆవేదన తో రాష్ట్రవ్యాప్తంగా తమ డిమాం డ్లను వినిపించడానికి రోడ్డె క్కారు. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణ యం మేరకు, అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపుమేరకు, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని మారుతి సా గ ర్ సూచనతో 33 జిల్లాల జ ర్నలి స్టులు ఆయా జిల్లాల కలెక్టర్లకు విన తి పత్రం అందించారు.
ఈ సందర్భంగా అనేక చోట్ల పోలీసు లు అత్యుత్సాహం తో జర్నలిస్టుల ను అరెస్టు చేయడం తీవ్ర విమర్శ లకు దారితీసింది.పోలీసుల జులు మును చేదించుకుంటూ తమ హ క్కులను కాపాడుకునేందుకు తెలం గాణ జర్నలిస్టులు మరోసారి ఉద్య మ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం తో తెలంగాణ సమాజం ఒకసారిగా అ ప్రమత్తమైంది జర్నలిస్టుల అరె స్టులను ఖండిస్తూ పలువురు ప్రజా స్వామికవాదులు మేధావులు రాజ కీయ నాయకులు అన్ని వర్గాల వా రు ప్రభుత్వ వైఖరి ని తీవ్రంగా ఖం డించారు. తమ హక్కులను కాపా డుకోవడానికి తెలంగాణ ఈనెల వర్కింగ్ జర్నలిస్టుల సంఘ మా ఆధ్వర్యం లో ఉద్యమ స్ఫూర్తితో శనివారం నాటి కలెక్టర్ కార్యాల యాల ముట్టడి కార్యక్ర మం విజ యవంతమైంది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఉపాధ్య క్షుడు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, TEMJU అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, IJU కార్యవర్గ స భ్యుడు అవ్వారి భాస్కర్, హైదరా బాద్ జిల్లా ఇంచార్జీ నవీన్ కుమార్, నేతలు బాపురావు, భాస్కర్,ప్రెస్ క్ల బ్ మెంబర్ అశోక్ దయాళ్,V5 సీ ఈఓ కడకంచి వెంకట్, సువర్ణ, రా మకృష్ణ రెడ్డి, దేవేందర్, సంతోష్, తదితర నేతలను అరెస్టు చేశారు.





