Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 1:55 pm Posted by : praja deveena

Telagana Rising global summit : సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ రైజింగ్ 2047 విజన్‌తో ముందు డుగు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

Telagana Rising global summit : ప్రజా దీవెన, హైదరాబాద్:
తెలంగాణను దేశంలో ఒక సమున్న తమైన స్థానంలో నిలపాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 20 47 విజన్‌తో ముందుడుగు వేసిన మా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిలషిం చారు. దీక్షా సంకల్పంతో నిర్ధేశించు కున్న లక్ష్య సాధనలో అందరి మద్ద తు, సహాయ సహకారాలను కా వా లని పారిశ్రామిక వేత్తలు, నిపుణు లు, మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీ (Bha rat Future City) (మీర్‌ఖాన్‌పేట్) లో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స మ్మిట్ 2025 (Telangana Ris ing Global Summit 2025) తొ లిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇత ర ప్రముఖులతో కలిసి ముఖ్య మం త్రి పాల్గొన్నారు. దేశ,విదేశాల నుం చి అతిరథ మహారథులు హాజరైన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మా ట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కో సం నిర్దేశిత లక్ష్యాలను సవివరంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగం యావత్తు అ యన మాటల్లోనే…

దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందే ళ్లు పూర్తి చేసుకుని ఉత్సవాలు చే సుకునే 2047 నాటికి యువ రాష్ట్ర మైన తెలంగాణ ఏం సాధించగల ద ని నిపుణులతో ఆలోచన చేసినప్పు డు తెలంగాణ రైజింగ్ 2047 (Tela ngana Rising 2047) ఆలోచన ల కు బీజం పడింది. భవిష్యత్తు కో సం లక్ష్యాలను నిర్ణయించుకుని సా ధించాలని సంకల్పించినప్పుడు తె లంగాణ సంస్కృతిలో దేవుళ్ల ఆశీ ర్వాదం తీసుకోవడం, ప్రజల మద్ద తు, సహకారం కోరడం మా సంప్ర దాయం.

తెలంగాణ భవిష్యత్తు కోసం రూ పొందించుకున్న విజన్ లక్ష్యాల సా ధన కోసం రాష్ట్రాన్ని సేవా రంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం అన్న మూడు ప్రాంతాలుగా విభ జ న చేశాం. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొట్ట స్థానంలో నిల పాలన్న లక్ష్యాలను నిర్దేశించాం. వా టినే క్యూర్, ప్యూర్, రేర్ అన్న మూ డు ప్రత్యేక మండళ్లుగా విభజన చే శాం.

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), గ్రామీణ వ్యవ సాయ రీజియన్ ఎకానమీ (RAR E) ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్ర జ ల నుంచి అభిప్రాయాలను కోరాం. వారి అంచనాలు, ఆలోచనలు, కల లను మాతో పంచుకున్నారు. అ లా గే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాం గం, అధికారులు, ఇండియన్ స్కూ ల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ ని పుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీ సుకున్నాం. తెలంగాణ రైజింగ్ దా ర్శనికతను రూపొందించడంలో స హాయ పడినందుకు వారందరికీ ప్ర త్యేక ధన్యవాదాలు.

ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబ ల్ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెం దిన మేధావులు, నిపుణులు ఇం దులో పాలుపంచుకోవడం తెలం గాణ అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గ జాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్త లు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ రెండు రోజుల సమ్మిట్‌లో మీ రందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీక రిస్తుంది.

1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మ న నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలో చనలు చేశారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వా గ్ధానాలను నెరవేర్చడానికి చర్చో పచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొం దించారు.దేశ భవిష్యత్తుగా ఒక రో డ్ మ్యాప్ వేయాలని భావించిన మ హాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి మేము ప్రేరణ పొందాం.

తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్ర త్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 20 14 లో శ్రీమతి సోనియా గాంధీ, ప్ర ధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నాం. దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించింది. అలాంటి తెలంగాణలో 10 సంవ త్సరాల తర్వాత ఇప్పుడు దేశంలో నే అత్యంత అభివృద్ధి చెందిన రా ష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయ త్నాలు ప్రారంభించాం. దేశంలో తె లంగాణ యువ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఎంతో పెట్టుబడులకు సానుకూల వాతావరణం, ఎన్నో అవకాశాలు న్నాయి.2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 20 47 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థి క వ్యవస్థగా తెలంగాణను తీర్చిది ద్దాలన్న లక్ష్యంగా నిర్ధేశించుకు న్నాం.

దేశ జనాభాలో తెలంగాణ దాదాపు 2.9% కలిగి ఉంది. జాతీయ జీడీ పీలో దాదాపు 5% వాటాను అంది స్తున్నాం. 2047 నాటికి, దేశ జీడీపీ లో 10% వాటాను తెలంగాణ అం దించే విధంగా తీర్చిదిద్దాలనుకుం టున్నాం.ఈ సందర్భంగా ఒక ఉదా హరణను ప్రస్తావించదల చుకున్నా ను. చైనాలోని గ్వాంగ్ – డాంగ్ ప్రావి న్స్ గురించి ఉదహరిస్తా. గ్వాంగ్‌ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ఇతర ప్రావిన్స్‌కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించడ మే కాకుండా వృద్ధిని సాధించారు.

తెలంగాణలో మేము కూడా ఆ న మూనాను అందిపుచ్చుకోవాలని నిర్ణయించాం. మేం చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందాం. మే మిప్పుడు ఆ దేశాలతో పోటీ పడ ద లచుకున్నాం. అందుకోసం తెలంగా ణ రైజింగ్ ప్రయాణంలో సహకరిం చాలని, పెట్టుబడులు పెట్టాలని, మాకు మద్దతు ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం.తెలంగాణ రైజింగ్ 2 047 విజన్ లక్ష్యాలు కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటిని సా ధించగలమన్న విశ్వాసం మాకుంది. ఈ విషయంలో మా బృందానికి చె బుతున్నదేమంటే.. కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దాం. మీర ది అసాధ్యమని భావిస్తే మరికొంత గడువిస్తాను.

నిన్నటికంటే ఈరోజు నాలో మరింత నమ్మకం పెరిగింది. నిన్నటి రోజున అదొక కల, ఒక ప్రణాళిక. ఇప్పుడు మీరంతా మాకు మద్దతుగా నిలిచా రు. దృఢసంకల్పంతో సాగిస్తున్న మా ఈ ప్రయాణంలో భాగస్వాము లు కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీ అందరి మద్దతు, సహకారంతో ల క్ష్యాలను సాధించగలం. రాష్ట్ర స మగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు ప్ర ణాళికలతో సాగుతున్న తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు. ఒక మంచి సంకల్పంతో వేసిన ఈ ముందడు గులో మా లక్ష్యాలను సాధించడా నికి మీరంతా భాగస్వాములు కా వాలని కోరుకుంటున్నానని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.