Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Terrorists Attack: ఉగ్రవాదుల ఉగ్రరూపం

–పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో పోలీస్‌ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలే లక్ష్యం గా నరమేధం
–వివిధ ప్రాంతాల్లో విచక్షణారహిత దాడుల్లో 73 మంది దుర్మరణం, 21 మంది ఉగ్రవాదులు సైతం హతం
–ఉగ్రవాదులు ఉన్నఫలంగా బస్సు లు అడ్డగించి ప్రయాణికులపై దారు ణం

Terrorists Attack: ప్రజా దీవెన పాకిస్థాన్: పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో (Balochistan province)ఉగ్ర వాదులు రెచ్చిపోయారు. పోలీస్‌ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచ క్షణారహితంగా దాడులకు పాల్ప డ్డారు. పాకిస్థాన్ లోని వివిధ ప్రాం తాల్లో వేర్వేరుగా జరిపిన దాడుల్లో మొత్తం 73 మంది మరణించగా మృతుల్లో 14 మంది సైనికులు, పో లీసులు ఉన్నట్లు అక్కడి అధికారు లు తెలుపుతూ 21 మంది ఉగ్రవా దులను కూడా హతమార్చినట్లు చెప్పారు. బలూచిస్థాన్‌లోని (Balochistan ) మసా ఖెల్‌ జిల్లాలో సోమవారం కొందరు ఉగ్రవాదులు ప్రధాన హైవేలపై బ స్సులు, ట్రక్కులను లక్ష్యంగా చేసు కొని దాడులకు పాల్పడినట్లు తెలి పారు. వాహనాలను అడ్డగించి, ప్రయాణికులను కిందకు దింపి కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 23 మంది మరణించారు (died). ఖలాత్‌ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులు, ట్రక్కులను అడ్డుకొని, ప్ర యాణికులను కిందకు దింపి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి కా ల్పులు జరిపినట్లు స్థానిక పోలీసు లు తెలిపారు. పంజాబ్‌ ప్రావిన్స్‌ నుంచి వచ్చేవారే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి వచ్చేవారు తమ వనరులను దోచుకుంటున్నారన్న ఆగ్రహంతోనే ఈ దాడులకు పాల్ప డుతున్నట్లు చెప్పారు. మృతుల్లో అత్యధికులు దక్షిణ పంజాబ్‌ (South Punjab)ప్రాం తానికి చెందినవారు కాగా, మరికొం దరు ఖైబర్‌ పఖ్తున్ఖ్వాకు చెందిన వారని తెలిపారు.

బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24, 25 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగి నట్లు తెలిపారు. ముసాఖెల్‌ హైవేపై (On Musakhel Highway)35కు పైగా వాహనాలకు నిప్పు పె ట్టినట్లు చెప్పారు. మరో ఘటనలో పాకిస్థాన్‌–ఇరాన్‌ మధ్యనున్న రైల్వే మార్గంలో క్వెట్టాను పాక్‌తో అను సంధానించే వంతెనను మందుపా తరలతో ధ్వంసం చేసినట్లు పోలీ సులు తెలిపారు. ఈ దాడిలో ఐదు గురు మరణించినట్లు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. మిలిటరీ శిబిరాలపై ఆత్మాహుతి దాడులు కూడా చేశా మని వెల్లడించింది. అయితే ఈ దాడులను అధికారులు ధ్రువీ కరించలేదు. బలూచిస్థాన్‌లో జరి గిన వేర్వేరు దాడుల్లో మొత్తం 73 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ (Balochistan province)ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, బీఎల్‌ఏ దాడులను పాక్‌ అధ్యక్షు డు ఆసిఫ్‌ జర్దారీ, ప్రధాని షెహ్‌ బాజ్‌ షరీఫ్‌లు తీవ్రంగా ఖండించా రు. బాధ్యులను వదిలిపెట్టబోమ న్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ప్రకటించారు. బలూచిస్థాన్‌ సీఎం సర్ఫరాజ్‌ బుగ్టి కూడా ఈ దాడులను పిరికిపందల చర్యగా అభివర్ణించారు.