Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The government in Telangana is certain తెలంగాణలో ప్రభుత్వం ఖాయం

--కేసీఆర్​ సర్కార్​కు కౌంట్ డౌన్​ ప్రారంభం -- తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం -- ఖమ్మం బీజేపీ సభలో అమిత్ షా ఆగ్రహం

తెలంగాణలో ప్రభుత్వం ఖాయం

–కేసీఆర్​ సర్కార్​కు కౌంట్ డౌన్​ ప్రారంభం
— తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం
— ఖమ్మం బీజేపీ సభలో అమిత్ షా ఆగ్రహం

ప్రజా దీవెన /ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలనను అంతం చేస్తూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ (Double engine Sarkar) ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని జోష్యం చెప్పారు.

ఖమ్మంలో ఆదివారం సాయంత్రం జరిగిన రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ ప్రభుత్వం, బీఆర్​ఎస్​ పార్టీ, సీఎం కేసీఆర్​పై అమిత్​షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు( Amitsha was furious). రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి(bjp) ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్​ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయని, కేసీఆర్​ సర్కార్​కు కౌంట్ డౌన్( ​ Count down to KCR Sarkar) ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోందని, ఓవైసీతో కలిసి కేసీఆర్​(KCR along with OYC)  తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని అవమానించారని గుర్తు చేశారు.

కేసీఆర్​ కారు స్టీరింగ్​ ఓవైసీ చేతిలో ( The steering of KCR’s car is in the hands of Oyisi) ఉందని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పరిపాలిస్తోందని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నoదున కేసీఆర్​ గద్దె దిగిపోవాల్సిందేనని ఎందుకు తెలంగాణ ప్రజలు సమాయత్తం(The people of Telangana are Samayat) కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ అయోధ్యగా భద్రాచలం ( Bhadrachalam as South Ayodhya) పేరుగాంచిందని, భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం కాగా ఆ సంప్రదాయాన్ని కేసీఆర్​ విడిచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కారు భద్రాచలం వస్తుంది కానీ రాముడి వద్దకు రాదని, బిజెపి సర్కారు వస్తే కమలాన్ని రాముడి పాదాల దగ్గర సమర్పిస్తామని(Let the lotus be offered at the feet of Rama) స్పష్టం చేశారు. రాష్ట్రo లో కారు స్టీరింగ్​ మజ్లిస్​ చేతిలో ఉందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీని గెలిపిస్తారా? కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా.? మజ్లిస్​ చేతిలో ఉన్న కేసీఆర్​ను మళ్లీ సీఎం చేస్తారా? అంటూ ప్రజలకు ప్రశ్నల వర్షం కురిపించారు.

బీజేపీ నేతలపై దాడులు చేస్తే వాళ్లు ఆగిపోతారని అనుకుంటున్నారని, ఈటెల రాజేందర్​ను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారని, ఎన్నో పథకాల పేరుతో ప్రజలను కేసీఆర్​ మోసం(KCR cheated people in the name of schemes) చేశారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్​ పార్టీ ఆనాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెడితే, ఈరోజు ప్రధాని మోదీ రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారన్నారని వివరించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని అరెస్టు చేశారని గుర్తు చేశారు.