The objective is the development of tribals గిరిజనుల అభివృద్ధే ధ్యేయం
--బుసిరెడ్డి పౌండేషన్ చైర్మెన్ పాండురంగారెడ్డి
గిరిజనుల అభివృద్ధే ధ్యేయం
–బుసిరెడ్డి పౌండేషన్ చైర్మెన్ పాండురంగారెడ్డి
ప్రజా దీవెన/ నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ నియోజకవర్గo పరిధిలోని గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తామని బుసిరెడ్డి పౌండేషన్ చైర్మెన్ పాండురంగారెడ్డి స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలo
మండలంలోని మేగ్య తండా, బోజ్య తండా, ధన్సింగ్ తండా, శీతల తండా, నేతాపురం గ్రామాలలో 17మంది నిరుపేద కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు.
అయా గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్ళి మరీ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు,గిరిజనులకు, వికలాంగులకు, అనాధలకు, వ్రృద్దులకు ఆసరాగా ఉండేందుకు ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మునుముందు కూడా పౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి,సర్పంచులు కేతావత్ బిక్ష నాయక్,దీపాసింగ్ నాయక్, నేతాపురం సర్పంచ్ బాసిరెడ్డి కుమారి వెంకటరెడ్డి,నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, గేమ్యానాయక్ తండా సర్పంచ్ నరేష్ నాయక్, చింతపల్లి సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి ఉప సర్పంచ్ లు బుజ్జి,దేశ్య, మట్టపల్లి ప్రదీప్ రెడ్డి, నందికొండ 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ,తిరుమలనాధ చైర్మన్ బుర్రి రామిరెడ్డి,మాజీ కోఆపరిటివ్ నాగెండ్ల క్రృష్ణారెడ్డి,లక్కీ ఫుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి,శివానంద రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న యాదవ్, వాడపల్లి శ్రీనుముదిరాజ్, సైదాచారి,నాగార్జున రెడ్డి,అనుముల కోటేష్,రమేష్ చారి,లింగస్వామి, షేక్ ముస్తఫా, లక్కిపుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి,వెంకన్న యాదవ్,మట్టారెడ్డి,జయంత్ రెడ్డి,గంగయ్య, అబ్దుల్ కరీం, భవాని రెస్టారెంట్ సైదాచారి, శ్రీకాంత్ రెడ్డి,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.