Thin Rice : మన తెలంగాణ , పెన్ పహాడ్ : శ్రీమంతులతో సమానంగా పేదలు సన్న బియ్యాన్ని తినాలని ఉద్దేశంతో ప్రజలకు పంపిణీ చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు.
పేదలందరికీ నాణ్యమైన సన్నబియాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంతో 2కోట్ల 81 లక్ష ల మంది లబ్ధిపొందనున్నారని తెలిపారు. మండలంలో మొత్తం 12758 తెల్ల రేషన్ కార్డు లు ఉన్నాయని వారందరికీ సన్న బియ్యం నేటి నుంచి అందుతాయని లబ్ధిదారులు సద్వినియం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వలేదనీగుర్తుచేశారు. ఇప్పటివరకు దొడ్డుబియ్యం అక్రమాలు జరిగాయని డీలర్లు రీసైకిల్ చేసి అమ్ముకున్నారని గుర్తుచేస్తూ, లబ్ధిదారులు ఎవరు రేషన్ డీలర్లకు బియ్యాన్ని అమ్మోద్దని సూచించారు.
ప్రభుత్వానికి భారమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం కొనుగోలు చేసి పేదల కోసం పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేద మహిళలు మహిళలు బారులు తీరడం ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఈ పథకం శ్రేష్టమైనదిగా అభివర్ణించారు. ఇందిరమ్మ రోటీ కపడా మకాం నినాదంతో పేదవారికి సంక్షేమ పథకాలు అందాలని ఆకాంక్షించారు . త్వరలో నియోజకవర్గానికి ఇండ్లు వస్తాయని పేదవారికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.దొడ్డు బియ్యం అక్రమ రవా ణా దీనితో అడ్డుకట్టబడుతుందని.
ఇప్పటినుండి బియ్యం లెక్క బరాబర్ ఉంటుందన్నారు ప్రజాదర్భార్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలోసమస్యలు. పరిష్కారం లభిస్తుందన్నారు. సన్న బియ్యం పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మహిళలకు ధన్యవాదాలుతెలిపారు. ప్రారంభించినందుకు రాష్ట్ర మంత్రిమండలి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దామోదర్ రెడ్డి, ఆర్తి కేశవులు, మాజీ జెడ్పిటిసి పిన్నని కోటేశ్వరరావు, గజ్జెల సైదిరెడ్డి ,షేక్ జానీ మియా ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు, విజయ్ రెడ్డి నాంపల్లి సైదులు ,మట్ట య్య మహిళ కాంగ్రెస్ నాయకురాలు జయమ్మ ,అలివేలు డీలర్ రామ్ బ్రహ్మం అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.