Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ThinRice scheme : పేదల ఆకలి తీర్చే పథకం సన్న బియ్యం పథకం

*ఉగాది ,రంజాన్ తర్వాత సన్న బియ్యం పండగ ప్రారంభమైంది
*సీఎం రేవంత్ రెడ్డి ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ లకు నిరుపేదలు రుణపడి ఉంటారు
*కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం: సామినేని ప్రమీల రమేష్

ThinRice scheme : ప్రజా దీవేన, కోదాడ: పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం లో సన్న బియ్యం పథకం ప్రారంభించిందని కోదాడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మరబండపాలెం లో షాప్ నెంబర్ 26 (డీలర్ కోదాటి శిరీష) ప్రభుత్వ పౌరసరఫరాల దుకాణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ తో కలిసి ప్రారంభించి ఆమెమాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచిందన్నారు.

చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలు సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉగాది రంజాన్ తర్వాత సన్న బియ్యం పండగ వాడ వాడలా ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ సామినేని నరేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొందు, షేక్ జానీ కోదాడ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, నన్నేసాహెబ్, కోదాడ పిఎసిఎస్ డైరెక్టర్ కమతం వెంకటయ్య, రంగారెడ్డి, నారపరాజు రంగారావు, మందరపు అనంత రాములు, వంగూరు గోపి, ఫిరోజ్, ఆర్కే రెడ్డి, నెల్లూరి రామారావు, బొల్లు నరేష్, సుల్తాన్ రాంబాబు , మాతంగి ప్రసాద్, విడిగొండ కనకయ్య, బొల్లు కృష్ణయ్య, గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు