–వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ
Tholi Ekadashi:ప్రజా దీవెన, హైదరాబాద్ : తొలి ఏకాదశి (Tholi Ekadashi) రోజైన బుదవారం రోజు ఏపీ, తెలంగాణా రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. తొలి ఏకాదశి (Tholi Ekadashi) కావడంతో భక్తులు పూజలు, ప్రార్థనలు చేసు కుంటున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా ఏపీ, తెలంగాణాల లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తుల తో కిటకిటలాడాయి.
ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూలు కట్టారు. తెలంగాణాలోని యాదగిరి గుట్ట, బాసర, వేములవాడ, భద్రాచ లం (Yadagiri Gutta, Basara, Vemulawada, Bhadrachalam) ఆలయాలకు భక్తులు పోటె త్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస ఏకా దశ రుద్రాభిషేకాలు, పరివార దేవ తార్చనలు (Rudrabhishekas, Parivara Deva Tarchana) నిర్వహించి కల్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించు కుంటున్నారు.జయశంకర్ భూపాల పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళే శ్వర ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలా డింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, అధికారులు కాలినడ కన గోదావరి నదిలో త్రివేణి సంగ మం వద్దకు చేరుకుని కుండలలో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే వర్షంలోనే కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు (Special Pujas)చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభా నంద దేవి ఆలయంలో కుంకుమా ర్చన పూజలు నిర్వహించారు. తిరుమలలో పొటెత్తిన భక్తజనం తిరుమల శ్రీవారి ఆలయానికి భ క్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24గంటల సమ యం పడుతోంది. భారీ వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అలాగే శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్మమ్మ (Kanakaduramma)వారి ఆల యం, సింహద్రి అప్పన్న దేవాల యం, అన్నవరంలలో కూడా భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు.