Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TIOL: పన్నుల సంస్కరణల్లో ఉత్తమ పనితీరు… తెలంగాణ రాష్ట్రానికి కాంస్య పతకం

TIOL: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పన్నుల విధానంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) తన పనితీరును చాటింది.”ట్యాక్స్ ఇం డియా ఆన్లైన్” (TIOL) వెబ్ పోర్టల్ 2024కు సంబంధించి పరోక్ష పన్ను లు, వాణిజ్య పన్నుల విధానంలో ‘నేషనల్ టాక్సేషన్ అవార్డ్స్’ తెలం గాణ ప్రభుత్వానికి కాంస్య పుర స్కారాన్ని అందించింది. ప్రజలకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూ ర్చేలా పారదర్శక పన్ను వ్యవస్థను రూపొందించినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ఈ పన్ను విధానాల ద్వారా పన్ను లు కట్టడంలో ప్రజలు స్వచ్ఛందం గా భాగస్వామ్యమయ్యేలా ప్రభు త్వం చైతన్యపరిచింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగ డంతో పాటు, స్నేహపూర్వక వ్యా పార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఈ సంస్కరణల ద్వారా జవాబుదారీతనం పెంపొం దటంతో పాటు, ప్రజలకు సంస్కర ణల ఫలాలు దక్కాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల (Digital platform) నుంచి సరళీకృత పన్ను చెల్లింపుల వరకు ఆర్థిక విధానాలను ఆధునీకరించి, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచింది.

మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును (award) రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ గారు తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ కు అంద జేశారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ దూరదృష్టి తో కూడిన పాలనతో ఎలాంటి అద్భుతాలు సాధించ వచ్చో చాట డానికి ఈ అవార్డు ఒక ఉదాహరణ అని అన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని ఆయన తెలిపారు. 2 లక్షల మంది పౌరుల ఓట్లు, జ్యూరీ సభ్యుల (Votes of citizens and members of the jury) ప్రమేయంతో ఈ అవార్డును అంద జేస్తూ ఉంటారు.