Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tirupati Railway Station: అత్యాధునిక సౌకర్యాలతో తిరు పతి రైల్వే స్టేషన్ మహర్ధశ

Tirupati Railway Station: ప్రజా దీవెన, తిరుపతి : తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి (MP Dr. Maddila Gurumurthy) బుధవారం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధి కారులు స్టేషన్ నిర్మాణ పనుల గూ ర్చి ఎంపీకి వివరించారు. అనంత రం నిర్వహించిన సమీక్షా సమావే శంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

తిరుపతి రైల్వే స్టేషన్ (Tirupati Railway Station) ద్వారా సంవ త్సరానికి సుమారు 6 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా అం తర్జాతీయ ప్రమాణాలతో రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభు త్వంతో సమన్వయం చేసుకొని రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధు లు సాధించామని గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదల య్యాయని అన్నారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం తిరుపతి నగరానికి తలమానికం అని అన్నారు.

సిఆర్ఎస్ లెవెల్ క్రాసింగ్ 109 వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ (Construction of railway under bridge)పనులు ఇప్పటికే మొదలయ్యాయని, లెవెల్ క్రాసింగ్ 108 కాటన్ మిల్లు దగ్గర, లెవెల్ క్రాసింగ్ 107 హీరోహొండా షోరూం దగ్గర అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేబుల్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని త్వరలో పూర్తి స్థాయిలో పనులు మొదలవుతా యని ఎంపీ తెలియజేసారు. వర్షా కాలం మొదలయిందని తిరుపతి పార్లమెంటు పరిధిలోని రైల్వే అండ ర్ బ్రిడ్జిలలో (Railway Under Bridges) నీరు నిలిచి రాకపోకల కు ఇబ్బంది కలగకుండా చూసుకో వాలని అధికారులను కోరారు. ఎంపీ నిధులు, తిరుపతి మునిసిప ల్ కార్పొరేషన్ నిధులతో తిరుపతి బస్టాండ్ ఎదురుగ నిర్మించ తల పెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాల కు సంబంధించి పనులు వేగవంతం చేయాలని ఎంపీ రైల్వే అధికారుల ను కోరారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మా ణం కోసం ఒక ప్రక్కన పనులు మొదలయ్యాయని, త్వరలో మరో వైపు పనులు మొదలెడుతామని వారు తెలియజేసారు.

రేణిగుంట సంత గేటు రైల్వే అండర్ బ్రిడ్జి (Railway Under Bridges) నిర్మించనున్నారని తెలియజేసారు. అలాగే రేణిగుంట రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి నెం. 171 నుంచి 175 వరకు 1200 మీటర్ల పొడవున సరైన నీటి పారు దల సౌకర్యం లేదని వారికీ తెలియ జేసారు. రైలు మార్గం పక్కనే ఉన్న కాలువలో పూడిక పేరుకుపోవ డం తో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్ప డి నీరు నిలిచిపోతోందని వర్షాకా లంలో డ్రైనేజీ సరిగా లేకపోవడం తో ట్రాక్‌పై తీవ్ర ప్రభావం చూపు తుందని అక్కడ సరైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ ఎంపీ కోరారు.మొత్తం రూ.200 కోట్లతో రేణిగుంట రైల్వే స్టేషన్ (Renigunta Railway Station)ఆధునీక రణ కోసం నిధులు మంజూరయ్యా యని చెప్పారు.

ఈ పనులు నాలు గు దశలలో చేపడతారని మొదటి దశ పనులు త్వరలో ప్రారంభమవు తాయన్నారు. అవసరమైన అను మతులు త్వరగా సాధించి పనులు మొదలెట్టాలని అనుమతుల విష యంలో ఏవైనా అవరోధాలు ఉన్న ట్లయితే తన సహకారం తీసుకోవా లని అధికారులను కోరారు.దానితో పాటు గూడూరు తిరుపతి మూడ వ రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయ్యిందని ఈ సందర్భంగా ఎంపీ తెలియజేసారు. పూడి, ఏర్పేడు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరి తగతిన భూసేకరణ చేయడం కోసం జిల్లా కలెక్టరుతో మాట్లా డుతానని తెలియజేశారు.