–టీజేఎఫ్ రజతోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అల్లం నారాయణ
TJF: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో మే 31న శనివారం జరుప తలపెట్టిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జలవిహార్ జర్న లిస్టుల జాతర సభా ఏర్పాట్లను శు క్రవారం సాయంత్రం మీడియా అ కా డమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అ ధ్య క్షుడు అల్లం నారాయణ పరిశీ లిం చారు. టీజేఎఫ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా జలవిహార్ లో రజతోత్సవా లను నిర్వహిస్తున్న విషయం తెలి సిందే. ఈ ఏర్పాట్లను అల్లం నారా యణ టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆస్కాని మారుతీ సా గర్, టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూ జే కోశాధికారి యోగానంద్, సహా య కార్యదర్శి యార నవీన్, ఐజే యు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ లతో కలిసి పరిశీ లించారు.
సభా నిర్వహణ ప్రధాన ప్రాంగణం, వేదిక, భోజన ఏర్పాట్ల ను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తం గా తరలివస్తున్న జర్నలిస్టులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా ఏ ర్పాట్లను చేయాలని అల్లం నారా యణ నాయకులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి టీజేఎఫ్ రజ తోత్సవ సభను జయప్రదం చేయా లని కోరారు.