Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TJF Silver Jubilee Celebration:నాటి టీజెఎఫ్ పోరాట స్పూర్తిని కొనసాగించాలి

–స్పష్టం చేసిన ప్రజా సంఘాల, మే ధావులు
–ప్రజా సంఘాలు, పార్టీలను మళ్ళీ సమన్వయం చేయాలి
–టీజెఎఫ్ పోషించే పాత్రకు మాసం పూర్ణ మద్దతు
— టీజెఎఫ్ రజతోత్సవ సభలో పలువురు వక్తలు

TJF Silver Jubilee Celebration: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమంలో నాటి కనబరిచిన స్ఫూర్తి ని తిరిగి నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇంకా మిగిలి న ప్రజా ఆకాంక్షలను అవసరాలను పరిపూర్ణం చేసేదిశగా తెలంగాణ ప్ర గతి ఎజెండాను రూపొందించి అమ లుకోసం ప్రజల తరఫున పోరాడా లని తెలంగాణ ప్రజాసంఘాల నేత లు, మేధావులు టీజేఎఫ్ కు సూ చించారు. తెలంగాణ సమాజం తె లంగాణ జర్నలి స్టుల వైపు మరో సారి చూస్తున్నదని ఆశాభావం వ్య క్తం చేశారు. 25 ఏండ్ల తెలంగాణ జ ర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ రజతో త్సవాల ప్రారంభోత్సవ సభ సభ ఆ దివారం హైదరాబాద్ జలవిహార్ లో ఘనంగా జరిగింది. టిజెఎఫ్ అ ధ్యక్షుడు అల్లం నారాయణ అధ్య క్షతన జరిగిన సభకు రాష్ట్రవ్యాప్తం గా వేలాదిగా జర్నలిస్టులు హాజర య్యారు.

నాటి తెలంగాణ ఉద్యమంలో కీల కంగా పాల్గొన్న విద్యార్థి ఉద్యోగ అ డ్వకేట్ సాంస్కృతిక తదితర పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద యం నుండి సాయంత్రం దాకా సా గిన ధూమ్ ధామ్ రజతోత్సవ సభ సందర్భంగా నాటి ఉద్యమ వాతవ రణం నెలకొంది. మానుకోట ప్రసాద్ బృందం కళాకారులచే సాగిన సాం స్కృతిక కార్యమాలు సభలో పండు గ వాతావరణాన్ని నింపాయి. ఈ సందర్భంగా ఆయా వక్తలు మాట్లా డారు.

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కార్యా చరణ ను రూపొందించుకోవాలని తెలంగాణ సమాజం తెలంగాణ జ ర్నలిస్టుల దిశగా చూస్తున్నదని ఆ దిశగా టి జె ఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర కార్యవర్గం చొర వచుపాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సా ధన లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం టీజేఎఫ్ నిర్వహించిన పాత్ర గొప్ప దనీ, విభిన్న భావజాలాలు కలిగిన తెలంగాణ ఉద్యమ సంస్థలను సం ఘాలను పార్టీలను సమన్వయం చే స్తూ రాష్ట్ర సాధన పోరాటంలో సం ఘటిత పరచడం చాలా సంక్లిష్ట మైన కార్యాచరణ అని అంతటి కష్టతరమైన కార్యాన్ని దిగ్విజయం గా కొనసాగించి, రాష్ట్ర సాధనలో కీ లక బాధ్యతను నిర్వర్తించిన అభి నందిస్తున్నామన్నారు. తమ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకోసం సంఘం పె ట్టీ పోరాడిన జర్నలిస్టుల సంఘం ప్ర పంచంలోనే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) మాత్రమే నని వక్త లు కొనియాడారు.

ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో దద్దరి ల్లి న సభ పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన పోరాడుతూ తెలంగాణ ప్రజ ల అస్తిత్వాన్నీ ఆకాంక్షలను కాపా డుకోవాల్సిన బాధ్యత న్నారు. ప్ర జలు తెలంగాణ జర్నలిస్టుల వైపు చూస్తున్నారు. నాటి ఉద్యమ స్ఫూ ర్తిని కొనసాగించాలనీ” పునరుద్ఘా టించారు. 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు కొనసాగు తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యా చరణను రూపొందించుకుంటమని అల్లం నారాయణ తెలిపారు .టీ జె ఎఫ్ రజతోత్సవ సభలో టీయూ డ బ్ల్యూ జే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఉపాధ్యక్షులు ర మేష్ హజారీ, కోశాధికారి యోగి, తె ము అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, కా ర్యదర్శి రమణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, పలు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న జర్న లిస్టులతో రజతోత్సవ సభవిజయ వంతమైంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కో దండరాం, దాసోజు శ్రవణ్, అంబే ద్కర్ ఓపెన్ యూనివ ర్సిటీ వి సీ గంటా చక్రపాణి, సీనియర్ పాత్రికే యులు పాశం యాదగిరి, సీనియర్ ఎడిటర్ కె శ్రీనివాస్, తెలంగాణ ప్ర జా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమా ర్, అరుణోదయ విమలక్క వీక్షనం ఎడిటర్ వేణుగోపాల్, ఉద్యోగసం ఘాల నేతలు దేవీప్రసాద్, సీ విఠల్, అయాచితం శ్రీధర్, అడ్వకేట్ జేఏసీ రాజేందర్ రెడ్డి, నల్ల ప్రహ్లాద్, విద్యు త్ జేఏసీ నేతలు జానయ్య, శివాజీ, ఓయు విద్యార్థి సంఘాల నేతలు రాజారాం యాదవ్, కోట శ్రీనివాస్, మందల భాస్కర్, జంజర్ల రమేష్, స్టాలిన్, తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.