Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TMC leaders: పశ్చిమ బెంగాల్ లో ఆటవికo

–లక్ష్మీపూర్‌లో టీఎంసీ నేతల ఘాతుకం

TMC leaders:కోల్‌కతా, జూన్‌ 30: పశ్చిమబెంగాల్‌లో (West Bengal) ఆటవిక విషయాలు వెలుగు చూసింది. బెంగాల్ లో ఇటువంటి సంఘటనలు ఎన్నో కొనసాగుతూనే ఉన్నాయి. తాజగా పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ (TMC in West Bengal) మద్దతుదారు ఒకరు ‘ఇన్సాఫ్‌ సభ’ పేరుతో ఆటవిక శిక్షలు విధిస్తున్న ఉదంతమిది. తాజాగా ఓ మహిళ, మరో యువకుడిని నడిరోడ్డుపై కింద పారేసి.. విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి, కాళ్లతో తన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మహమ్మద్‌ సలీమ్‌ స్వయంగా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో (social media) షేర్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌ అవుతున్నా.. అటు ప్రభుత్వం గానీ, ఇటు పోలీసులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే చోప్రా నియోజకవర్గ (Chopra Constituency) పరిధిలోని దిఘల్‌గావ్‌ ప్రాంతం, లక్ష్మీపూర్‌ గ్రా మంలో టీఎంసీ ఎమ్మెల్యే హమీ ద్‌–ఉర్‌–రెహ్మాన్‌ అనుచరుడు జేసీబీ అలియాస్‌ తేజేముల్‌ అనే వ్యక్తి తక్షణ న్యాయం పేరుతో స్థాని కంగా ‘ఇన్సాఫ్‌ సభ’లను ఏర్పాటు చేస్తూ ఆటవిక శిక్షలను విధిస్తుంటా డు. ఈ క్రమంలో వివాహేతర సం బంధం పేరుతో ఓ మహిళను, మరో యువకుడిని చితకబాదుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ (viral)అ య్యింది. బాధిత మహిళ దెబ్బలకు తాళలేక రోడ్డుపై పొర్లుతూ రోదిస్తు న్నా కనికరం లేకుండా కర్రతో ఎడా పెడా దాడి చేశాడు. మరో యువ కుడిని కూడా ఇదేవిధంగా హింసిం చాడు. చుట్టూ జనం గుమిగూడినా ఓ వృద్ధుడు మినహా ఎవరూ తేజే ముల్‌ను ఆపేందుకు యత్నించలే దు. కొంతదూరంలోనే పోలీసు పెట్రోలింగ్‌ జీపు ఉన్నా ఒక్క పోలీ సు కూడా కిందకు దిగి, అతణ్ని వారించే ప్రయత్నం చేయలేదు. దీనిపై సీపీఎం నేత సలీం సీరియస్‌ అయ్యారు. బెంగాల్‌లో (Bengal) మమత హ యాంలో ఆటవిక శిక్షలను విధిస్తు న్నారని ఆరోపించారు. బీజేపీ సోష ల్‌ మీడియా చీఫ్‌ మాలవీయ కూడా తాలిబాన్ల తరహాలో శిక్షలు విధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంద ని ప్రశ్నించారు.