–తెల్లవారుజాము నుండే బస్ డి పోల వద్ద బైఠాయించిన బీసీ శ్రేణు లు
–హైదరాబాదులో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద బీసీల ధూమ్ దాం
–బీసీల ఆందోళనకు మద్దతుగా హా జరైన పిసిసి మహేష్ గౌడ్, మంద కృష్ణ, నెల్లికంటి సత్యంలు
–బంద్ ను విజయవంతం చేసి బీ సీల ఐక్యత చాటిచెప్పాలి
–బీసీ బంద్ తోనైనా కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు కళ్ళు తెరవాలి
–బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
Telangana Total Bandh : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ్యాం గ సవరణ ద్వారా బీసీలకు బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత క ల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెం చిన బీసీ రిజర్వేషన్లను యధావి ధి గా అమలు చేయాలని ప్రధాన డి మాండ్ తో బీసీ జేఏసీ ఇచ్చిన పిలు పుమేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్టణo వర కు సకలం బంద్ జరిగినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్ల డించారు. తెలంగాణ రాష్ట్ర బందు లు భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెల్లవారుజామున నా లుగు గంటల నుండి హైదరాబా దు లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద వందల మంది బీసీ శ్రేణులతో జా జుల శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ బస్సుల ను బయటకు కదలకుండా 12 గం టల పాటు ఆందోళన నిర్వహించా రు. ఆందోళన సందర్భంగా గంగిరె ద్దుల విన్యాసాలు, బీసీ కళాకారుల ఉద్యమ గీతాలతో ఆటపాటలతో ధూమ్ దాం ను నిర్వహించారు దీని తో బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు క ళాకారుల ఆటపాటలతో బీసీ ఉ ద్యమకారుల నినాదాలతో దద్ద రి ల్లిపోయింది.
బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాము అనుకున్న దాని కంటే రాష్ట్ర బంద్ చారిత్రాత్మకంగా విజయవంతం జరి గిందని ఈ బంధు ద్వారనైనా బీసీ రిజర్వేషన్ల కు రాజ్యాంగ రక్షణ క ల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వా లు చొరవ చూపాలని ఆయన డి మాండ్ చేశారు ఈ బంద్ రాష్ట్రంలో శాంపిల్ మాత్రమేనని ముందు ముందు బీసీ రిజర్వేషన్లు 42 శా తం సాధించేవరకు తెలంగాణ ఉ ద్యమ తరాహాలోని బీసీ ఉద్య మాన్ని రగిలిస్తామని ఆయన హె చ్చరించారు. తక్షణమే రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలప క్షం తో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒ త్తిడి పెంచాలని, అవసరమైతే బీసీ రిజర్వేషన్లు ఆమోదించే వరకు ప్ర ధాని రాష్ట్రపతి భవన్ లో వద్ద సీ ఎం ధర్నా చేపట్టాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తులు సహకారంతో ఈ రోజు రాష్ట్ర బంద్ దిగ్విజయం జరి గిందని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు లో జేఏసీలో చర్చించి బీసీ రథయా త్రను అన్ని జిల్లాలో చేపట్టి హైదరా బాదులోని గ్రౌండ్ లో లక్షల మంది తో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఢిల్లీ పై ఒత్తిడి పెంచడానికి ప్రత్యేక రైళ్ల ద్వారా ఢిల్లీకి వెళ్లి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ యన తెలిపారు రాష్ట్ర బంద్ తోనై నా కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తొమ్మి దవ షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్చి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చే శారు.
పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రి జర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్ర భుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకిం చా ల్సిన అవసరం లేదని స్థానిక సం స్థ ల ఎన్నికల ను ఆపి బీసీ రిజర్వేష న్లు పెంచాలని గత 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని గత సుప్రీం కోర్టు తీర్పులు గత ప్రభుత్వం చే సి న చట్టమూలంగా బీసీ రిజర్వేషన్ల కు మోక్షం లభించడం లేదని ఆయ న అన్నారు. బీసీ రిజర్వేషన్ల విష యంలో ఒక పార్టీపై ఇంకొక పార్టీ నెపం నెట్టు కోవడం సరికాడని బీసీ రిజర్వేషన్ల పెంచడం వలన కాంగ్రెస్ పార్టీకి మైలేజీ వస్తుందని బిజెపి అ నుకుంటే బిజెపి పార్టీ నే చొరవ తీ సుకొని ఆ పార్టీ అధ్యక్షులు రామ చంద్రరావు ప్రధాని సమయం తీ సు కుంటే సీఎం అఖిలపక్షంతో ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆ యన అన్నారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తర ఫున రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చామని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీసీ రిజర్వేషన్ల కు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీ సుకోవాలని మహేష్ గౌడ్ కోరారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షు లు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మా ట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచ డానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్ప టివరకు చిత్తశుద్ధితో వ్యవహరించి నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి పెంచాల్సి నా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దేననీ , బీసీ రిజర్వేష న్ల బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తమ భుజాల మీద వేసుకొని బీసీ రిజర్వేషన్లు సాధించగలిగితే ఆ క్రెడి ట్ రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఆ యన అన్నారు.
తెలంగాణలోని బిజెపి పెద్దలు బీసీ రిజర్వేషన్ల విషయంపై ఢిల్లీ పెద్దల తో చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ యన కోరారు అగ్రవర్ణాలకు ఏడ బ్ల్యూస్ ద్వారా రిజర్వేషన్లు పెంచిన ప్పుడు కానరాని 50% పరిమితి బీ సీ రిజర్వేషన్ పెంచినప్పుడే కనప డడం చాలా ఆక్షేపనియమన్నారు.
బీసీఉద్యమానికి మద్దతుగా ఎ మ్మార్పీఎస్ అండగా నిలబడు తుం దని మందకృష్ణ తెలిపారు.
సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ప్ర భుత్వాలు నిర్లక్ష్యం చేస్తే బీసీలు తి రగబడడం ఖాయమన్నారు. ఇప్ప టికైనా బీసీల్లో అగ్రహ జ్వాలలు ర గలకముందే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ క ల్పించాలని లేకపోతే బీసీలతో భా రత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమిస్తుం దని ఆయన హెచ్చరించారు.
ఈ ఆందోళన కార్యక్రమం లో మై నింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్ అనిల్, బీసీ జేఏసీ కో చైర్మన్ రాజా రాం యాదవ్, లంబాడ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నా యక్, కాంగ్రెస్ మహిళా నేత ఇంది రా శోభన్,బీసీ సంక్షేమ సంఘం రా ష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కు ల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాం యాద వ్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, , బీసీ మహిళా సంఘం అధ్యక్షు రాలు బర్ల మణిమంజరి సాగర్, బి సి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షు లు గొడుగు మహేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బిసి యువ జన సంఘం జాతీయ ఉపాధ్యక్షు లు రావులకోల్ నరేష్ ప్రజాపతి, పా నుగంటి విజయ్ గౌడ్, వరికు ప్పల మధు, మాదేశి రాజేందర్, నరసిం హ నాయక్, జగన్నాథం, మహిళా సంఘం నాయకురాలు తారకేశ్వరి సమత యాదవ్, శ్యామల, స్వర్ణ గౌడ్, గౌతమి, సంధ్యారాణి, విజ యలక్ష్మి,గూడూరు భాస్కర్, జిల్లెల నరసింహ, వెంకటేష్ గౌడ్, ఇంద్రమ్ రజక, సత్యం గౌడ్, భారత్ గౌడ్, గుంటి మహేష్, నాగరాజ్ , మీనా దేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొ న్నారు. ఆందోళన అనంతరం ఎం జీబీఎస్ బస్ స్టేషన్ నుండి అసెంబ్లీ వరకు బారీ బైక్ ర్యాలీ నిర్వహిం చారు.