*ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం – ప్రమాదాన్ని అరికడదాం: మల్లేష్
Traffic Rule Violations : ప్రజా దీవెన, కోదాడ: జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నిర్వహించిన రహదారి ప్రమాదాల నియంత్రణ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని శనివారం కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్ టాక్సీ స్టాండ్ నందు ట్రాఫిక్ నియమ నిబంధనల ఆంక్షలు అంశాల గురించి ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ వాహనదారులు రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా రోజు రోజుకు పెరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా జరిమానా తప్పదన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. బైకులకు సైలెన్సర్లు తీసేసి నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే చట్టరీత్య చర్యలు తీసుకొని జరిమానతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష. ప్రతి ఒక్క వాహనదారునికి ఆర్సి డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అయన వెంట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.