— సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం
— రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Transport Minister Ponnam Prabhakar Goud : ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాష్టాల్రన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కొంత మంది సర్వే లో పాల్గొనకుండా తమ సమాచా రాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. భారాస నేతలు చెబు తున్నట్లు ఇది రీసర్వే కాదని పొ న్నం స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొ నని భారాస నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిప డ్డారు. ప్రజాస్వామ్యం విూద విశ్వా సం ఉంటే భారాస అగ్ర నేతలు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కరీంన గర్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘భాజపా వ్యాపారులస్తుల అనుకూల పార్టీ.
కులగణన, బీసీ, ఎస్సీ వర్గీకరణ ఆ పార్టీకి ఇష్టం లేదు. ప్రజల అకాంక్షలకి అను గుణంగా తెలంగాణలోనూ రిజ ర్వేషన్లు అమలు చేయాలి. సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సామా జిక మార్పు కలిగించే నిర్ణయం ఇది. రాజకీయ విమర్శల కొసమే భాజపా నేతలు బీసీలు, ముస్లిం లపై విమర్శలు చేస్తున్నారు. ము స్లిం కమ్యూనిటీలోని పేద ముస్లిం లు బీసీలోనే కొనసాగుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యే కంగా సమావేశం నిర్వహిస్తాం. బల హీన వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే శాస నసభలో బిల్లును అడ్డుకొవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.