— రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకాలు నిరంతరం కొనసాగే పథకాలు
— ఈ పథకాల అర్హుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదు
–ఈనెల 21 నుండి నిర్వహించే గ్రా మ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసు కోవచ్చు
— గ్రామ సభలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతరం కొనసాగే పథకాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా గతంలో ఈ పథకాలకి దరఖాస్తు చేసుకొని ఉండి, అర్హుల జాబితాలో పేర్లు లేనట్లయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈనెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామసభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశా రు. సోమవారం ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో గ్రామ సభల నిర్వహణ విషయమై ఆమె మాట్లాడుతూ గ్రామ సభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించా రు. షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వ హించే విషయాన్ని టాం టాం చేయించాలని ఆదేశించారు.
ము ఖ్యంగా గ్రామ సభలలో టెంటు, కుర్చీలు, తాగునీరు , పరిసరాలను శుభ్రత, ప్రజా పాలన గ్రామసభలు పేరుతో గ్రామసభలు నిర్వహించాలని, అవసరమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, స్టేషనరీ, ఇతర సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే ఆయా పథకాల కింద అర్హులైన జాబితా కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలని, గ్రామసభలలో ఈ అన్ని పనుల బాధ్యత ఎంపీఓలపై ఉందని చెప్పారు . అన్నీ పథకాలకు సంబంధించి టాకింగ్ పాయింట్స్ ను అలాగే,ఆయా పథకాల కింద అర్హుల జాబితాను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించి గ్రామసభ ఆమోదం పొందాలని అన్నారు. గ్రామసభల లో తీర్మానం నమోదు చేయడం, అలాగే ఆ తీర్మానాలన్నింటినీ భద్రపరిచే బాధ్యత , డేటా ఎంట్రీ ఎంపిడిఓ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామ సభల సందర్భంగా ఆయా పథకాల కింద ప్రజలు ఎలాంటి దరఖాస్తులు ఇచ్చినా గ్రామసభల బృందాలు స్వీకరించాలని ,ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు.
రైతు భరోసా పథకంలో భాగంగా గ్రామ సభలలో వ్యవసాయ యోగ్యం కానీ, అర్హతలేని జాబితాను చదివి వినిపించాలని చెప్పారు. అలాంటి వాటిపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేసుకొని గ్రామసభ తీర్మాణం మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఎంపీడీవో లాగిన్ ద్వారా జిల్లా స్థాయికి, తద్వారా రాష్ట్ర స్థాయికి పంపించాలని, ఇదివరకే ఉన్న రేషన్ కార్డులలో కొత్తగా పేర్లను జోడించేందుకు తహసిల్దారు లాగిన్ ద్వారా డిఎస్ఓ, జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్రస్థాయికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో పేర్ల జోడింపుకు సుమారు 77000 దరఖాస్తులు లాగిన్ లో ఉన్నాయని, వీటన్నింటిని గ్రామసభలలో చదివి వినిపించి ఒకవేళ ఎవరైనా లేనట్లయితే గ్రామసభ ఆమోదంతో అలాంటి పేర్లు తీసివేయాలని చెప్పారు. అలాగే రేషన్ కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు ఇస్తే తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించాలని, ఇందులో ఇల్లు నిర్మించుకునేందుకు జాగా ఉండి అర్హత ఉన్న వారి జాబితా,జాగా లేక ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హత ఉన్న వారి జాబితాలను వేరువేరుగా చదివి వినిపించాలని చెప్పారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరించాలని చెప్పారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రాష్ట్రస్థాయి నుండి వచ్చిన అర్హుల జాబితాను చదివి వినిపించాలని, ఒకవేళ ఈ పథకం కింద అర్హుల జాబితాలో పేర్లు ఉండి ఎవరికైనా భూమి ఉన్నట్లు తెలిసి అభ్యంతరాలు వస్తే ఆభ్యంతరాలను స్వీకరించి పది రోజుల్లో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటిని సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచొద్దని, జిల్లా స్థాయి ఫిర్యాదులు జిల్లా స్థాయిలో పరిష్కరించాలని, ఒకవేళ రాష్ట్ర స్థాయికి పంపించేవి రాష్ట్ర స్థాయికి పంపించాలని చెప్పారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముందుగా అన్ని బృందాలకు వెంటనే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ,గ్రామ సభలలో కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, గ్రామ సభల సందర్భంగా అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామ సభల నిర్వహణలో ఏలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వ హించాలని చెప్పారు. ప్రత్యేక కలెక్టర్ నటరాజ్ , డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, డిఎస్ ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఉన్నారు.కాగా ఈ సోమవారం 105 మంది దరఖాస్తుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు.