–ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
Maha Lakshmi Scheme :ప్రజాదీవెన,హైదరాబాద్: మహాల క్ష్మి పథకంతో టీజీఎస్ ఆర్టీసీ లాభా ల బాట పట్టిందని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.6,6 80 కోట్లు ఆదా అయ్యిందని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయి న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ర్టీసీలో వేడుకలు నిర్వహించారు. ఎంజీబీఎస్ లో జరిగిన కార్యక్రమం లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క, మంత్రులు పొన్నం ప్రభాక ర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్ర సంగం ఆయన మాటల్లోనే..ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన త ర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభా ల్లోకి వచ్చింది. 200 కోట్ల మహిళా ప్ర యాణి కుల చార్జీ లను 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సం స్థకి చెల్లించింది. ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు 67 శాతం ఉంటే ఈరో జు 97 శాతానికి చేరింది. ఆర్టీసీ ఇటీవల వేల సంఖ్యలో కొత్త బ స్సు లు కొన్నం. హైదరాబాదులో కాలు ష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెన కాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు కొను గోలు చేస్తున్నం. ఇప్పటికే 3 వేల కొ త్త బస్సులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ
ప్రతి గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త డబుల్ రోడ్లు వచ్చే నెలలోనే ప్రారంభిస్తున్నామని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీ సుకు పోతుందని తెలిపారు. గతం లో నిర్వీర్యమైన ఆర్టీసీని నుoచి లా భాల్లోకి వచ్చేలా చేశామని చెప్పా రు. కోటి మంది మహిళలను కో టీ శ్వరులను చేయడమే లక్ష్యంగా స ర్కార్ పని చేస్తోందన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కార్మి కుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం మరవదని అన్నారు. ఆర్టీసీలో కొత్తగా నియామకాలు జరుగుతు న్నాయని, మహాలక్ష్మి పథకం విజ యవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అభినం దనలు తెలిపారు. గత పదేండ్లల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. సంస్థ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయా ణం కల్పించాం. పెండింగ్ లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు తీరుస్తు న్నమని తెలిపారు.