TTD: ప్రజా దీవెన, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara Swamy) వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా, అక్టోబరు 03 రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకు రార్పణం జరుగనుంది.వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురా ర్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయ వంతం కావాలని కోరుతూ స్వామి వారిని ప్రార్థించేందుకు అంకురార్ప ణం నిర్వహిస్తారు. ఇందులో భాగం గా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనం తరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు (special poojas)నిర్వహించి పుట్ట మన్నులో నవధాన్యాలను నాటు తారు.
నవధాన్యాలకు మొలకలొ చ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ (Annual Brahmotsavam of Srivari) ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.