Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TTD Key Decision: తితిదే కీలక నిర్ణయం, తిరుపతి పరిధిలో చిరుతల సంచారంతో పలు సూచనలు

TTD Key Decision: ప్రజా దీవెన, తిరుపతి: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదా రి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శ నా నికి రావడం అనవాయితీ. తాజా గా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. తిరుమల తిరుపతి పరిధిలో చిరు తల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది. భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల క్రితం అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్‌ విభాగం అప్రమత్తమైంది. చిరుతను పట్టుకొనేందుకు ప్రయ త్నాలు చేస్తూనే భక్తులకు అలర్ట్ చేస్తున్నారు.తిరుమలలో చిరుతల కదలికలు గుర్తించారు. చిరుతల సంచారంతో టీటీడీ విజిలెన్స్, అట వీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నడక దారి మార్గంలో భక్తుల రాకపోకల పైన ఆంక్షలను విధించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.

అలిపిరి వద్ద నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యథావిధిగా అనుమతిస్తు న్నారు. అనంతరం గుంపులు గుం పులుగా పంపిస్తున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది భక్తులు ఉండేలా విజిలెన్స్‌ సిబ్బం ది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్స రాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించ డం లేదు. రాత్రి 9.30 గంటల తరు వాత అలిపిరి నడక మార్గాన్ని మూ సివేస్తున్నారు. గతంలో చిరుత దా డిలో ఒక చిన్నారి ప్రాణం కోల్పో యింది. అంతకు ముందు మరో చిన్నారి తీవ్రంగా గాయ పడ్డాడు. దీంతో, చిన్నారుల అనుమతి విష యంలో ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. రాత్రి సమయంలో పూర్తిగా నడక మార్గాన్ని మూసివే స్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమేరాల ద్వారా చిరుతల కదలికలను ఎప్పటికప్పు డు గుర్తిస్తున్నారు.

ఇదే సమయం లో అటవీ శాఖ సిబ్బంది చిరుతల కదలికల ఆధారంగా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముం దుగా భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా అవసరమైన చర్యల పైన ఫోకస్ చేసారు.టీటీడీ అధికారులు సైతం భక్తులకు కీలక సూచనలు చేసారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశిం చాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచా ర, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయిన ప్పటికీ ఇటీవల కొంత మంది భక్తు లు తమకు కేటాయించిన సమ యానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించా లని సిబ్బందితో వాగ్వాదానికి దిగు తున్న అంశాన్ని టీటీడీ గుర్తించింది. మరి కొంత మంది సోషల్ మీడి యాలో అసత్య ప్రచారం చేయటం సరైన విధానం కాదని పేర్కొంది. భక్తులకు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.