ప్రజా దీవెన, తిరుపతి: దశాబ్దాల తరబడి తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి త్వరలో చరమగీ తం పాడనున్నారు. చలిగాలులలో పిల్లాపాపలతో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ లలో పడరాని కష్టాలు పడుతున్న సామాన్య భక్తులకు ఈ పరిస్థితి త్వరలో కనుమరుగు కా నుంది. తిరుమలకు వచ్చిన భక్తు లకు కేవలం గంట సమయంలో పుగానే స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ పాలక మండలి ఇటీవల చేసిన తీర్మానా న్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న భక్తులకు మొదటగా వారి ఆధార్ కార్డు నం బర్, ఫేస్ రికగ్నషన్తో కూడిన రసీ దును అందించేందుకు అందులో వారికి శ్రీవారి దర్శనాన్ని సమయా న్ని సూచిస్తూ డిజి లాకర్ తరహాలో ఒక టోకెన్ ను ముందుగా అందిస్తా రు.
ఈ టోకెన్ తీసుకున్న భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే అక్కడ ఏర్పా టు చేసిన ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ ద్వారా నేరుగా భక్తులు క్షణాల్లో స్కానింగ్ పూర్తిచేసుకుని నేరుగా క్యూ లైన్ కి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేవలం గంట సమయంలోపుగానే స్వామి వారి దర్శనం పూర్తిచేసుకుని ఆల యం వెలుపలకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ టోకెన్లు పొం దేందుకు భక్తులకు సరిపడా దాదా పు 30 కౌంటర్లను ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఈ 30 కౌంటర్ లతోపాటు ఫేస్ రికగ్నేషన్ చేసేందు కు కూడా ఇదే తరహాలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద మరో 30 స్కా నింగ్ పేస్ రికగ్నేషన్ ఎంట్రన్స్ లను కూడా ఏర్పాటు చేస్తారు.
ఎక్కడా సిబ్బందితో పని లేకుండా ఆటోమే టిక్ గా విమానాశ్రయాలలో ఏ వి ధంగా అయితే డిజి లాకర్ పద్ధతి అమలు చేస్తున్నారో అదే తరహాలో తిరుమల కొండపై కూడా భక్తులు గంటలు తరబడి వేచి ఉండే అవ సరం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా యంతో కేవలం గంట సమయంలో పుగా శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు కావలసిన మౌలిక సదుపాయాలన్నింటిని కల్పించేం దుకు తిరుమల తిరుపతి దేవస్థా నం సిద్ధమైంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ విధానం అమలు కోసం కావలసిన ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్ ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు కూడా ముందుకు వచ్చా యి. ఇప్పటికే టీటీడీలో అమలు చేస్తున్న విధానం భక్తులను దర్శనా నికి అనుమతిస్తున్న విధానం టిటి డి పరిస్థితులు రోజుకు తిరుమల కు వస్తున్న భక్తుల సంఖ్య, వారి నుంచి సేకరిస్తున్న సమాచారం తదితర పూర్తి వివరాలన్నింటినీ సాఫ్ట్వేర్ సంస్థలకు టీటీడీ అం దించడం జరిగింది.
ఈ మేరకు త్వరలో టీటీడీలో అమలు చేయ నున్న ఏఐ విధానాన్ని ప్రయోగాత్మ కంగా ప్రొజెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నిపుణు లు టిటిడి ఉన్నతాధికారులకు నేటి నుండి వారం రోజుల పాటు ప్రయో గాత్మకంగా ప్రదర్శించనున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈ అంశంపై టిటిడి ఈవో శ్యామ లరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ముఖ్య భద్రతా ధికారి శ్రీధర్ తదితరులతో ఇప్పటి కే ఈ విషయమై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. వారం రోజులపాటు ఆర్టిఫిషియల్ ఇంటె లిజెంట్స్ పై పూర్తి అవగాహన కలిగిన అనంతరం ముందుకొచ్చిన 4 సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఒక ఒప్పం దం అనంతరం ఇందుకు సంబంధిం చిన ఏర్పాట్లు పూర్తి చేసి మూడు మాసాల్లోగా భక్తులకు ఈ విధానా న్ని అందుబాటులోకి తీసుకొచ్చేం దుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు.
టీటీడీలో ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా భక్తులకు కేవలం గంటలో పుగా శ్రీవారి దర్శనం కల్పించే నూ తన విధానాన్ని అమలు కోసం ఇప్పటికే టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ను కలిసి పూర్తి వివరాలను చర్చించినట్లు సమా చారం. ఈ అంశంపై మేధావులు ఎంతో అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారులకు కూడా తట్టని ఆలో చనలు మీకు రావడం నిజంగా గొప్ప విషయం అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయు డుని ప్రశంసించినట్లు తెలుస్తోంది. త్వరలో అమలు కానున్న ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ విధానం టీటీడీ లో విజయవంతం అయితే. వాస్త వానికి టిటిడి చరిత్రలో కేవలం గం టలోపు సామాన్య భక్తులకు సైతం స్వామి వారి దర్శనాన్ని కల్పించిన చరిత్ర కేవలం ఒక్క బిఆర్ నాయు డు కే దక్కుతుందనేది కాదన లేని వాస్తవం.