TTD: ప్రజా దీవెన అమరావతి: ఆపద వ చ్చినా, తప్పొప్పులకు అట్టే ఆలి పోయి ఆదుకోవయ్యా అంటూ ఆ పద మొక్కులకు ఆలవాలమైన ఆలయాల్లోనూ అడ్డగోలు వ్యవ హారాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అప్పటి ఉమ్మడి ఆంద్రప్ర దేశ్ లోనూ, ఇప్పటి అవిభక్త ఆంద్ర ప్రదేశ్ లోనూ తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాలు ప్రపంచ వ్యాప్తం గా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు ప్రసిద్ధ ఆలయాలకు ప్రతి రోజూ వేలాది, లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇక, పం డగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్ర త్యేకమైన రోజుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తుంటడం ఆనవాయితీ. తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మెుక్కులు చెల్లించు కోవాలని ఆశ పడుతుంటారు. అ యితే అటువంటి ఆలయాల్లో సై తం భక్తుల అమాయకత్వాన్ని ఆస రాగా చేసుకుంటున్న కేటుగాళ్లు కొన్నేళ్లుగా రెచ్చిపోతున్నారు. ఆల యాల సిబ్బంది రూపంలోనో లేదా స్థానికంగా పలుకుబడి కలిగి ఉం టూనో భక్తులను మోసం చేయడ మే పనిగా పెట్టుకుంటున్నారు. సిండికేట్గా ఏర్పడి ధనార్జనే ధ్యే యంగా అక్రమాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా దర్శన టికెట్లకు సంబం ధించిన మోసాలు ఇటీవల కాలం లో ఎక్కువగా వెలుగు చూస్తున్నా యి.
ఇష్ట దైవాలను దర్శించుకునేం దుకు వచ్చిన వారి నెత్తిపై శఠగోపం పెడుతున్నారు సదరు కేటుగాళ్లు. నకిలీ టికెట్లు అంటగడుతూ నిలు వునా దోచేస్తున్నారు. నకిలీ టికెట్ల తో వెళ్లిన వారికి ఆలయాల సిబ్బం ది చెప్పే మాటలు షాక్ ఇస్తున్నా యి. వందల వేలు పోసి టికెట్లు కొం టే అవి నకిలీ అని తేలడంతో లబో దిబోమంటున్నారు.తాజాగా అలాం టి ఘటనే శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14న శ్రీశైలం మల్లన్న దర్శనానికి కొంత మంది భక్తులు వచ్చారు. దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు వేల రూపాయలు కాజేసి వారికి నకిలీ టికెట్లు అంటగట్టారు. వాటిని తీసుకుని సదరు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. తమ వం తు వచ్చే సరికే స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్లి ప్ర యత్నం చేశారు. అయితే టికెట్లు స్కానింగ్ కాకపోవడంతో వారిని సిబ్బంది నిలువరించారు.
వాటిని ఫేక్ టికెట్స్గా తేల్చారు. దీంతో భక్తులు, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమో దు చేశారు. కాగా, దర్యాప్తు చేప ట్టిన ఒకటో పట్టణ పోలీసులు నిం దితులను గుర్తించారు. వెంటనే అ దుపులోకి తీసుకుని విచారణ చేప ట్టారు. అనాదిగా కొనసాగుతోన్న ఇ లాంటి అక్రమాలను ఆయా ఆల యాల అధికారులు,పాలకవర్గాలు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న ప్ప టికి వాటికి అడ్డుకట్ట పడకపోగా అ క్రమార్కుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని విమర్శలు వెల్లు వె త్తుతున్నాయి. ఈ క్రమంలో ఇటు వంటి కార్యక్రమాలకు శాశ్వత పరి ష్కారం చూపాల్సి ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
