TTD: ప్రజా దీవెన, తిరుమల :లోక కల్యాణార్థం, సర్వ దోషాల (For the good of the world, all evils)నివారణకు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమం (Peace home) నిర్వహించారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు పర్య వేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధ రింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెం తగల యాగశాలలో వైఖానస ఆగ మోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హో మం ముగిసిన అనంతరం ఆల యం వెలుపల టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు.
ఈ శాంతి హోమం (shanthi homama)ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను, అపో హలను పక్కన పెట్టవచ్చు అన్నా రు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరం గాచార్యులు మాట్లాడుతూ యాగ శాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరా ధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహించినట్లు తెలి పారు. పూర్ణాహుతి (completeness)అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు.
ఇక నుంచి లడ్డూ ప్రసా దాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషా లు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. సాయం త్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు (Devotees of Shri) తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మం త్రాలైన…. ”ఓం నమో నారాయ ణాయ, ఓం నమో భగవతే వాసు దేవాయ, ఓం నమో వేంకటేశాయ” లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు. ఈ కార్యక్ర మంలో జేఈవో వీరబ్రహ్మం, ఆల య డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధానార్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేదపారాయణదారులు, రుత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.