ప్రజా దీవెన, తిరుమల: తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసి నా సంహించేదేలేదు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశం లోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విష యాన్ని చర్చించి నిర్ణయం తీసుకు న్నాం. తిరుమల కొండపై రాజకీ య వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదేలేదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యల కు ఆదేశిస్తున్నామన్నారు.