TTD: ప్రజా దీవెన, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోడా నికి నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. నడక దారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ (TTD)అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం (Srivari Mettu Path) ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికె ట్లను జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో (Srivari Mettu Path) 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు 6 వేలు టికెట్లు జారీ చేయాలని టీటీడీ (ttd)నిర్ణయించింది. ప్రస్తుతం నడకదారి భక్తులకు టికెట్ల జారీ పెంపుతో భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.నడకదారి భక్తులకు టికెట్లు జారీ చేయాలనే డిమాండ్ (demand)కొన్నిరోజులుగా విని పిస్తోంది. కూటమి అధికారంలోకి రావడం, టీటీడీలో అధికార మార్పి డి జరగడంతో కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఈ నిర్ణయాలు ప్రశంస లు అందుకుంటున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.