TTD: ప్రజా దీవెన కొండగట్టు: కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjaneyaswamy)భక్తుల ఏళ్లనాటి కల నెరవేర బోతోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. అదేంటీ.. కొండగట్టు అంజన్న భక్తుల కల నెరవేర టానికి.. టీటీడీ శుభవార్త చెప్ప టమేంటని అనుకుం టున్నారా.. అక్కడికే వస్తున్న. టీటీడీ (ttd)బోర్డు ఆధ్వర్యంలో దేశంలోని పురాతన ఆలయాల అభివృద్ధి కార్య క్రమం లో భాగంగా.. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి (Kondagattu Anjaneyaswamy)ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే.. అంజన్న భక్తుల కోరిక మేరకు 100 గదులను నిర్మించేం దుకు టీటీడీ ముందుకొచ్చింది.ఈ క్రమంలోనే.. ఈ గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు ఆలయ సమీపంలోని స్థలాన్ని పరిశీలిం చారు. అధికారులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి (MLA MEDIPALLY) సత్యంతో పాటు ఆలయ ఈవో స్థలాన్ని చూపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సత్యం (MLA Satyam).. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం.. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఇస్తామని ఆశపెట్టి అంజన్న భక్తులను మోసం చేసిం దని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముంఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. త్వరలోనే.. టీటీడీ (TTD)ఆధ్వర్యంలో 100 గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గదుల నిర్మాణంతో పాటు.. అరుణాచలం మాదిరిగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ సేవను (Giri Pradakshina Seva)ప్రారంభించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. ఇందు కోసం త్వరలోనే రూట్ మ్యాప్ కూడా ఖరారు చేయను న్నట్టు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే కొండగట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం 400 ఏళ్ల క్రితమే నిర్మితమైనట్టుగా.. చరిత్ర చెప్తోంది. అక్కడ ఆంజనేయుడు స్వయం భువుడిగా వెలిశాడని పెద్దలు చెప్తుంటారు. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిసరాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి సాక్షాత్కారం అయినట్టుగా చెప్పుకుంటుంటారు. అలాంటి ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ వాసులకు కొంగు బంగారంగా వెలుగొందుతోంది.