Tungaturthi News : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రభుత్వా లు మారినా, పాలుకులు మారినా తలరాత మారదన్న నానుడి తుంగ తుర్తిలో కూడా నిజమని నిరూపిత మవుతోంది. అందుకు తగ్గట్టుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్ర అ భివృద్ధికి ఆమడదూరం కొనసాగు తోంది. అభివృద్ధిలో ఎంత మాత్రం ముందుకు సాగడంలేదనడానికి ని యోజకవర్గ కేంద్రంలో కంపచేట్లతో కమ్మేసిన బస్టాండ్ దుస్థితి చెప్పకనే చెబుతోంది.
నియోజకవర్గానికి అంతటికి గుండె కాయలాంటి తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రం అభివృద్ధికి ఆమడ దూ రంలో ఉందంటే అతిశక్తి లేదు. ము ఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న మెయి న్ రోడ్డు పరిస్థితి ప్రయాణికుల సౌ కర్యార్థం నిర్మాణమైన బస్టాండ్ కం పచెట్ల మయంగా మారిన పట్టించు కునే నాధుడే లేకపోవడం పట్ల ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనునిత్యం సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మిర్యాలగూడ, హైదరాబాద్, తొర్రూర్ తదితర ప్రాం తాలకు తుంగతుర్తి నియోజకవర్గం నుండి వివిధ డిపోల నుండి వచ్చే బస్సులు వచ్చిపోతుంటాయి. బ స్సులన్నీ అరకొర వసతులతో కం ప చెట్ల మయంగా నిండిన బస్టాండ్ లోనే ఆగాల్సి ఉంటుంది. మరుగు దొడ్లు పనికిరాకుండా పోయాయి.
అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతి నిధులు బస్టాండ్ ముందునుండే వె ళ్లి రావడం కనిపిస్తుంది. అయినా బస్టాండ్ పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు అంటున్నారు. కంప చెట్లు చెత్తాచెదారంతో పేరుకుపో యిన బస్టాండ్ చెత్తచెదారంతో ప్రా ణాంతకమైన పాములు సంచరిస్తు న్నట్లు కూడా విమర్శలు వెల్లువెత్తు న్నాయి.
ప్రజలు నియోజకవర్గ కేంద్రంలో మె యిన్ రోడ్డు గుంతల మయంగా మారడమే కాకుండా ఇటీవల ఆ ర్బాటంగా మరమ్మతులు చేస్తామని అధికారులు కంకర పోయడం తో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. మోటార్ సైకిల్ వాహ న దారులు పోసిన కంకరలో బండ్లు జారిపోవడం వల్ల అడ్డం పడి గా యాల పాలవుతున్నట్లు ప్రజలే చె బుతున్నారు.
తుంగతుర్తి మెయిన్ రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని ప్రజలు అంటు న్నారు. మెయిన్ రోడ్డుపై మోరి వే యడానికి సుమారు దశాబ్ద కాలం క్రితం సిమెంట్ పైపులు రోడ్డుపై వే శారు. ఇంతవరకు మోరి తవ్వలేదు పైపులు వేయలేదు. రోడ్డుపై సిమెం ట్ పైపులు అలాగే పడి ఉన్నాయి. తుంగతుర్తి పెద్ద చెరువు వైపు వెళ్లే రోడ్డు తుంగతుర్తి నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రోడ్డు దారుణంగా ఉంది. తుంగతు ర్తి మెయిన్ రోడ్డు ఎటువైపు చూసిన అద్వానంగా కనిపిస్తోంది.
తుంగతుర్తి అంబేద్కర్ బొమ్మ నుండి పెట్రోల్ బంక్ వైపు వెళ్లే రోడ్డు పై ఇళ్లలో నుండి మురుగునీరు ప్రవ హిస్తున్న అధికారులు ఎవరూ పట్టిం చుకోవడం లేదని ప్రజలు అంటు న్నారు. కనీసం పాదచారు నడవ డానికి సైతం డ్రైనేజీ వాటర్ ఇ బ్బం దికరంగా ఉందని అంటున్నారు. ని యోజకవర్గ మొత్తానికి ఆదర్శవం తంగా ఉండాల్సిన తుంగతుర్తి కేం ద్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడానికి అధికారుల నిర్లక్ష్య మే నని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనై నా అధికారులు తుంగతుర్తి మెయి న్ రోడ్డుతో పాటు బస్టాండ్ పరిశు భ్రంగా ఉండేలా చర్యలు చేప ట్టా ల ని నియోజకవర్గ కేంద్రాన్ని అం దం గా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతు న్నారు.