Tungaturthi MLA Samel : తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ పిలు పు, తుంగతుర్తి ప్రజలు గోదావరి జలాలు వినియోగించుకోవాలి
Tungaturthi MLA Samel : ప్రజాదీవెన,తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తుంగతుర్తి ని యోజకవర్గానికి గోదావరి జలాలు వచ్చాయని సుమారు రెండు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందు ల సామేలు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కొడకండ్ల వద్ద బయ న్నవారు రిజర్వాయర్ నుండి తుం గతుర్తి ప్రాంతానికి వచ్చే ఎస్సారెస్పీ కాలువల గేట్లను ఎత్తి గోదావరి జ లాలను విడుదల చేశారు. ఈ సంద ర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదా వరి జలాలు నియోజకవర్గంలోని అ న్ని గ్రామాలకు అందడమే కాకుండా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సా రెస్పీ కాలువ ఉన్నంతవరకు ప్రవహి స్తాయని అన్నారు.
ఇప్పటికే వర్షాలతో చెరువులు కుం టలు నిండాయని వచ్చే గోదావరి జలాలను సైతం రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. రా ష్ట్రంలో ప్రజాపాలన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రజలకు అందుతుందని అందులో భాగంగా నే అనేక అభివృద్ధి సంక్షేమ పథకా లు అమలవుతున్నాయన్నారు.
తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి చెం దాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే వెంట డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సీని యర్ నాయకుడు లక్ష్మయ్య లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.