Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tungaturthi Road Condition : తుంగతుర్తి గుంతలమయం, రోడ్డు ప్రయాణo నరకప్రాయం

–రోడ్డుతవ్వి మోరీలు వేసి పునర్ని ర్మాణం మరిచిన వైనం

–రావులపల్లి, తుంగతుర్తి రోడ్డు మా ర్గంతో అవస్థలో ప్రజానీకం

Tungaturthi Road Condition : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి నియోజకవ ర్గంలో రవాణా వ్యవస్థ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని రోడ్ల పరి స్థితి అధ్వానంగా మారిందని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి మండలం లో అనుని త్యం రద్దీగా ఉండే రావులపల్లి, వెం పటి, తుంగతుర్తి మీదుగా జాతీయ రహదారి 365 ను కలిసే రోడ్డు దా రుణంగా తయారైందని స్థానిక ప్రజ లు వాపోతున్నారు.

రోడ్డు పనులు ప్రారంభించిన కాం ట్రాక్టర్ కేవలం మొరీలు మాత్రమే త వ్వి వాటిపై కంకర సిమెంట్ వేసి అ నంతరం మట్టిని పోశారు. దీంతో అ వి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లుగా మారి ఇ టీవల కురిసిన వర్షాలకు ఆటోలు చిన్న కార్లు వెళ్లడానికి ఇబ్బందిక రం గా మారడంతో ద్విచక్ర వాహనదా రులు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

వర్షాలు కురిసి రోడ్డంతా బురదమ యంగా మారి వాహనదారులు కిం ద పడిన సంఘటనలు లేకపోలేద ని అసహనం వ్యక్తం చేస్తున్నారు. . రోడ్డు తవ్వి మోరీలు వేసి నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మాత్రం ప్రారంభం కాలేదని ప్రజలు అంటు న్నారు. ఈ రోడ్డుపై అనునిత్యం వం దలాది వాహనాలు ప్రయాణిస్తుం టాయి. ముఖ్యంగా గిరిజన తం డా వాసులు తుంగతుర్తి కి రావాలన్నా సూర్యాపేటకు వెళ్లాలన్న ఇదే రోడ్డు గుండా ప్రయాణించాల్సి ఉంది తుం గతుర్తికి రవాణాలో ఆయు పట్టు లాంటి రోడ్డు మరీ అద్వానంగా త యారు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు జరిగేలా చూడాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు పూర్తిచేసి రవాణా సౌకర్యం మెరుగుపరచాలని యావత్ ప్రజానీ కం కోరుతుంది. అలాగే తుంగతుర్తి నుండి బండ రామారం మీదుగా గుండెపురి తిరుమలగిరి వెళ్లే రోడ్డు తుంగతుర్తి నుండి అన్నారం మీదు గా సంగం నుండి నూతనకల్ కి వెళ్లే రోడ్డు తుంగతుర్తి నుండి కొత్తగూడెం మీదగా గోరింట ,పోలుమల్ల వెళ్లే రో డ్డు తుంగతుర్తి గానుబండ, తూర్పు గూడెం రోడ్లు మరి అద్వానంగా ఉ న్నాయని ప్రజలు అంటున్నారు.

తక్షణమే పాలకులు పట్టించుకుని రోడ్లను పునర్నిర్మానం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని యావత్ ప్రజానీకం కోరుతోoది.