–టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్
TUWJtjf: ప్రజా దీవెన, చండూరు: తెలంగాణ జర్నలిస్టుల ఫో రం ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని మే 31 న 25 వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా హైదరాబాద్ జల విహార్ లో నిర్వహించ తలపెట్టిన జర్నలిస్టుల జాతర మహాసభకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున తర లివచ్చి జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా టీయూ డబ్ల్యూజే – 143 అధ్యక్షులు గుండగోని జయశంకర్ పిలుపునిచ్చారు. నల్ల గొండ జిల్లా మునుగోడు ని యోజకవర్గం టీయూడబ్ల్యూజే – 143 కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో నియోజకవర్గస్థాయి జ ర్నలిస్టుల విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
కే జి ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ సార్ నాయక త్వంలో అన్ని రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల ప్రజలను ఒక్క గొడు గు కిందికి చేర్చి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి ఊది రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషిం చి న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ముందు వరసలో నిలిచిందని, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని జర్నలిస్టులంతా కలిసికట్టుగా ఒక వేదికపై సమస్యలను చర్చించడా నికి, 25 సంవత్సరాల పాటు తె లంగాణ జర్నలిస్టు ఫోరం పోషిం చి న పాత్ర పై జర్నలిస్టులతో చర్చించే అవకాశం ఉన్నందున నల్లగొండ జి ల్లా ప్రతి మండలం నుండి పెద్ద ఎ త్తున జర్నలిస్టులు తరలివచ్చి జ ర్నలిస్టుల జాతరను విజయవం తం చేయాలని ఆయన కోరారు.
జర్నలిస్టుల విస్తృత సమావేశానికి నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్య క్షులు గాలెంక గురుపాదం కార్య క్రమంలో పాల్గొని జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు రెండు ని యోజకవర్గాలలో టీజేఎఫ్ మహా సభ పోస్టర్ల ఆవిష్కరణ జరిగిం దని, మునుగోడు నియోజకవర్గం లో శుక్రవారం టీజేఎఫ్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేప ట్టడం జరిగిందని, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ని యోజకవర్గాలలో గోడపత్రికల ఆ విష్కరణ కార్యక్రమం పూర్తి చేయ డం జరుగుతుందన్నారు.
కార్యక్రమానికి , జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సల్వాది జానయ్య, టీ యూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు పో లగోని లక్ష్మీకాంత్ గౌడ్, హాజరు కాగా విస్తృతస్థాయి సమా వేశాని కి నియోజకవర్గ అధ్యక్షులు బొ డ్డు సతీష్ అధ్యక్షత వహించా రు. మునుగోడు నియోజకవర్గం టీ యూడబ్ల్యూజే-143 ప్రధాన కా ర్య దర్శి కోడి రాములు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు కాంశెట్టి ప్రెస్ యా ధయ్య, నాంపల్లి మండల యూ lనియన్ అధ్యక్షులు గడ్డం వెంకటే శ్వర్లు, కోట అయోధ్య, జి రవీం ద ర్, జి లింగస్వామి, మర్రి గూడెం మండల అధ్యక్షులు వడ్డే రమేష్, ప్రధాన కార్యదర్శి గుణగంటి యా దయ్య గౌడ్ చండూరు కూర్పాటి శ్రవణ్, ఇరిగి సుధాకర్, గట్టుప్ప ల్, మునుగోడు, మండలాల యూని యన్ అధ్యక్షులు, కార్య దర్శులు, యూనియన్ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.