Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 9:16 am Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం,రైస్ మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలి 

–యుద్ధ ప్రాతిపదికన ధాన్యం దించుకోవాలి

–రబీ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడాలి

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం అన్ లోడ్ ను రైస్ మిల్లర్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అల్టి మేటం జారీ చేశారు.శుక్రవారం అ యన తన ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, ధాన్యం సేకరణకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వ హించారు.కొనుగోలు కేంద్రాలకు రబీ ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నం దున రైస్ మిల్లర్లు జాప్యం చేయ కుండా మిల్లులకు వచ్చిన ధాన్యా న్ని వెనువెంటనే అన్ లోడ్ చేసు కో వాలని ఆదేశించారు.

వివిధ కారణాలతో మిల్లుల వద్ద లారీలు అన్లోడ్ కాకుండా నిలిచిపో కూడదన్నారు.రబీ ధాన్యం సేకరణ లో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడి వారికున్న పూర్తి సామర్థ్యంతో వ చ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు అన్ లోడ్ చేసుకోవాలని కోరారు. జిల్లా లో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రా లలో సుమారు 3 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం ఉందని, మరో 15 రోజుల్లో మరో 3 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉ న్నందున మిల్లర్లు పూర్తి సామర్థ్యం తో పని చేయాల్సిన అవసరం ఉం దని చెప్పారు.

తాలు, లారీలు తదితర కారణాల తో ఎలాంటి కొర్రీలు విధించకుండా ధాన్యాన్ని దించుకోవాలని, ఈ విష యంలో రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశా రు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటి ఫైడ్ లారీలను ఏర్పాటు చేయమ ని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. ఈ విషయంలో మిల్లర్లతో పాటు, కొనుగోలు కేం ద్రా ల నిర్వాహకులు సహకరించాల న్నారు.

ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉ న్న ధాన్యాన్ని మిల్లులకు పంపిం చేందుకు పూర్తిస్థాయిలో లారీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుం టామని తెలిపారు. మిల్లర్ల సమ స్యలను సానుకూలంగా పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటా మ ని, బ్యాంకు గ్యారెంటీ, మిల్లర్ అగ్రి మెంటు సమర్పించని మిల్లర్లు తక్ష ణమే ఇవ్వాలని ఆదేశించారు.

ధాన్యం సేకరణలో ఎట్టి పరిస్థితు లలో రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్ష సూచన లను దృష్టిలో ఉంచుకొని కొనుగో లు కేంద్రాలకు వచ్చిన దాన్యం తడ వకుండా, పాడవకుండా ముందు గానే కొనుగోలు చేయాల్సిన అవస రం ఉందన్నారు. కొనుగోలు కేంద్రా ల నిర్వహకులు ధాన్యం లోడింగ్ లో ఒకే వెరైటీని మాత్రమే లోడ్ చే సి పంపించాలని, “ఏ” గ్రేడ్ ధాన్యం తో కామన్ వెరైటీలు కలిపి పంపిం చకూడదని చెప్పారు.

ఇప్పటివరకు ఆయా మిల్లుల వారి గా దిగుమతి చేసుకున్న ధాన్యం వి వరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలని చెప్పారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీని వాస్, రబీ ధాన్యం సేకరణ పై మిల్ల ర్లకు పలు సూచనలు చేశారు. పౌర సరఫరాల జిల్లా అధి కారులు వెంక టేశం, రామ్ పతి నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డి ఓ శేఖర్ రెడ్డి, డిసిఓ పత్యా నాయ క్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్య క్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీని వాస్ తదితరులు ఉన్నారు.