–ఉపాధ్యాయుల సమస్యలపై ప్ర భుత్వం స్పందించాలి
— పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్
Secretary Sunkari Biksham Goud : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభు త్వ ఉపాధ్యాయుల సమస్యల ప రిష్కారానికి పిఆర్టియు రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఆ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుం కరి భిక్షం గౌడ్ స్పష్టం చేశారు. ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం తరాల దేవ య్య ఉద్యోగ విరమణ సందర్భం గా నిర్వహించిన అభినందన సభ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు
పదవీ విరమణ చేసిన ఉపాధ్యా యులకు రావలసిన పెన్షన్, గ్రా ట్యుటీ, GPF, లీవ్ సాలరీ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్లు నెలల తరబడి ఆలస్యం చేయడం ప్రభుత్వానికి సి గ్గుచేటని మండిపడ్డారు. జీవితాం తం ప్రభుత్వానికి సేవలందించిన ఉపాధ్యాయులు చివరికి తమ హ క్కుల కోసం కార్యాలయాల చు ట్టూ తిరుగుతూ ఆర్థిక ఇబ్బందుల తో మానసిక వేదనకు గురై ప్రాణా లు కోల్పోతున్న ఘటనలు బాధా కరమన్నారు.
ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెని ఫిట్స్ వెంటనే చెల్లించి వారి చా వులు ఆపాలని ఆయన ప్రభు త్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయ బద్ధంగా రావాల్సిన PRC, DA బ కాయిలను వెంటనే మంజూరు చే సి వారిని ఆదుకోవాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో జీ వో నెంబర్ 25 ఉపాధ్యాయులపై అనవసర భయాందోళనలకు దా రితీస్తుందని, ఇప్పడున్న పద్దతి కా కుండా తరగతికి ఒక ఉపాధ్యా యుడు తప్పక ఉండాలి అని అం దుకు ఎంత స్ట్రెంత్ అవసరం ఉం టాదో అంతే ఉంచాలని తక్కువ ఉంటే వాటిని ఏమి చేస్తారో మాకు తెలియదు అని వారు పేర్కొన్నా రు. ఇంకా మూసా పద్దతిలో ఉన్న GO 25 ను పూర్తిగా మార్చి ప్రభు త్వ పాఠశాలలు బాగుండాలి అన్న చిత్తశుద్ధి తో PRTU TS సంఘం మరియు గౌరవ MLC లను మరి యు అన్ని సంఘాలను పిలిచి మా ట్లాడాలని ప్రభుత్వానికి సూచిం చారు.
ఈ సందర్భంగా సుంకరి బిక్షం గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే…పదవీ విరమణ చేసిన ఉ పాధ్యాయుల అన్ని రిటైర్మెంట్ బెని ఫిట్లు వెంటనే విడుదల చేయాలి.PRC, DA బకాయిలను వెంటనే మంజూరు చేసి చెల్లించాలి.జీవో నెంబర్ 25ను తక్షణమే రద్దు చేయాలి, మెజారిటీ ఉపాధ్యా యు ల సూచనలు పాటించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను అ త్యవసరంగా భర్తీ చేయాలి, పాఠ శాలల్లో మౌలిక వసతుల కొరతను వెంటనే తొలగించాలి.మెడికల్ రీ యింబర్స్మెంట్, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
పదోన్నతులు, బదిలీలను ఆల స్యం చేయకుండా పారదర్శకంగా నిర్వహించాలి. ప్రభుత్వం ఇప్ప టి కైనా ఉపాధ్యాయుల ఆవేదనను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోక పోతే రాష్ట్రవ్యాప్తంగా మహా ఉద్య మాలకు పిలుపునిస్తాం. అవస ర మైతే నిరవధిక ఆందోళనలు చేప డతాo. ఉపాధ్యాయుల గౌరవం కాపాడ టం, వారి హక్కులను పరిర క్షించ డం ప్రభుత్వ బాధ్యత అని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ముందుగా ఉపాధ్యాయుల సంక్షే మాన్ని ప్రభుత్వం నిర్ధారించాలని పేర్కొన్నారు.
