Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Maha Sampark Abhiyan : మహా సంపర్క అభియాన్ కార్యక్రమంలో గడప గడపకు బీజేపీ

**బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ*

Maha Sampark Abhiyan :  ప్రజా దీవెన, నల్గొండ రూరల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొనీ గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా కలిసి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు బిజెపి పార్టీకి మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహించారు..

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ప్రవేశ పెడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు మరింత కృషి చేయాలని కోరారు

కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ , మండల అధ్యక్షులు బొగరి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి బాకీ నరసింహ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.