–రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
Peddireddy Narsireddy : ప్రజా దీవెన నాంపల్లి: కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి నర్సిరెడ్డి అకాల మరణం లోటని ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు ఆయన గురువారం రోజున స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ లో జరిగిన సంతాప సభకు హాజరయ్యారు అనంతరం నర్సిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నీవాళ్ళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సిరెడ్డి తన కుటుంబ సభ్యులను ఉన్నత విద్యలు అందించి విద్యావంతులుగా తీర్చిదిద్దారని తన కుమారుడు సంచివ రెడ్డి (రాజు )నాంపల్లి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నాడని అన్నారు
నర్సిరెడ్డి తో తన చిన్నప్పటి అనుబంధాలను గుర్తు చేశారు నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నాంపల్లి పట్టణ అభివృద్ధికి గత 20 సంవత్సరాల నుండి నర్సిరెడ్డి సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ నర్సిరెడ్డి మమ్మల్ని విద్యావంతులుగా ఉండాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచనలు చేసేవారని జ్ఞాపకాలను వివరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకట్ రెడ్డి మాజీ సర్పంచులు కోరే యాదయ్య కొండ్రెడ్డి వెంకటయ్య న్యాయవాదులు కోరే కిషన్ కోరే శ్రీను నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య నాయకులు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొండయ్య గుండెబోయిన సత్తయ్య తోటి పరమేష్ మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి తదితరులు పాల్గొన్నారు