–పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారా మన్
–ప్రధానoగా నవరంగాల పైనే పూర్తి స్థాయిదృష్టి కేంద్రీకృతం
–బిహార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు భారీ కేటాయింపులతో అందలం
–కొత్త పన్ను విధానoతో టాక్స్ పే యర్స్ ను ఆకట్టుకున్న కేంద్రం
–విద్యార్థులు,నిరుద్యోగులు, రైతు లు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదు పాయాలకు బడ్జెట్ లో సింహభాగం –బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, కొనుగోలుదా రులకు కాస్తoత ఊరట కలిగించే అంశం
–కొత్త పన్ను విధానంలో మార్పులు నిరుద్యోగులు, రైతులు, గ్రామీణాభి వృద్ధికి పెద్దపీట
— దేశంలో ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలమ్మ రికార్డు
Union Budget: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత దేశం యావత్తు వేయి కళ్ళతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ (budget) ను కేంద్రం మంగళవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్ల మెంటులో బడ్జెట్ వివరాలను వెల్ల డించారు. మొత్తంగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడం గమ నార్హం. గతంలో మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డు (6సార్లు)ను ఆమె అధిగమించారు. కాగా బడ్జెట్ లో ప్రధానంగా తొమ్మిది రంగాలకు కీలక ప్రాధాన్యత కల్పించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగకల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణా భివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాతతరం సంస్కరణలు వంటి అంశాలను పొందుపరిచారు.
అన్నదాత కు మరో ఐదేళ్లు అండగా…వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.లక్షల కోట్లు బడ్జెట్ లో (budget) కేటాయించారు. రైతుల పంట లకు మద్దతు ధరలు కల్పించే ప్రధా నమంత్రి అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిం చారు. ఈ బడ్జెట్లో మొత్తం తొమ్మిది రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చా మని, నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి కోసం క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవ సాయం, దాని అనుబంధ రంగా లకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) వివరించారు.
కోటి మంది యువతకు ఉద్యోగాల (jobs)కల్పన…విద్య, ఉపాధి, రూ. నైపుణ్యానికి లక్ష కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.
4.1 కోట్ల యువత కోసం 5 ప్రత్యేక పథకాలు తీసుకున్నట్లు, 2024-25 వార్షిక సంవత్సరానికి గాను పార్ల మెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రం నిరుద్యోగులకు గుడ్యూస్ (good news) చెప్పింది. ప్రధాన మంత్రి (prime minister) ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతు న్నట్లు ప్రకటించింది. కొత్త ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఓ చెల్లింపుల్లో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. తొలిసారిసంఘటిత రంగంలోకి ప్రవేశించిన ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయి దాల్లో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. గరిష్టంగా రూ.15 వేలు చెల్లిం చనున్నట్లు వివరించింది. నెలకు గరిష్టంగా రూ. లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు అని క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ది చేకూరనుంది. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యో గాలను కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఐటీ కొత్త విధానంలో స్వల్ప ఊరట
రూ. 3 లక్షల ఆదాయం వరకు జీరో టాక్స్ (zero tax)కాగా స్టాండర్డ్ డిడక్షన్ 50 నుంచి 75వేలకు పెంపు, వేతన జీవులకు మరోమారు నిరాశే కొత్త పన్ను విధానంలో కేంద్రం మార్పులు చేసింది. సున్నా నుం చి రూ. 3 లక్షల వరకు జీరో ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. రూ.3 లక్షల నుంచి- రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను విధించింది.రూ.7 లక్షల- రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్ విధించిం ది. ఇక రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల 20 శాతం పన్ను విధించగా రూ.15 లక్షల పైన ఉన్న వారికి 30 శాతం పన్ను విధించ నున్నట్లు తెలిపింది. కాగా కొత్త విధా నం వల్ల రూ.17,500 పన్ను ఆదాకానున్నట్లు పేర్కొన్నది.
ఉపాధి కల్పనకు ఊతం
ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై (Employment generation, skill training, MASME) దృష్టి సారించా రు. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల కేటాయింపుతో 4.1 కోట్ల మం ది యువతకు విద్య, ఉపాధి, నైపు ణ్యం కోసం ఐదు పథకాలతో కూడి న ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటిం చారు. ఇందుకు రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించారు. దేశీయ సం స్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
స్టాక్ మార్కెట్లు ఢమాల్
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitaraman)పార్లమెంట్లో మంగళవారం వరుస గా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపె ట్టారు. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 48.21 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో మొత్తం ఆదాయం రూ.32.07 కో ట్లు కాగా పన్ను ఆదాయం రూ. 28. 83 లక్షల కోట్లు, అలాగే అప్పులు పన్నేతర ఆదాయాలు రూ. 16 లక్ష ల కోట్లుగా అంచనా వేశారు. ఇది లా ఉంటే బడ్జెట్పై గంపెడు ఆశలు పెట్టుకున్న స్టాక్ మార్కెట్లకు భారీ షాక్ తగిలింది. ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం తో సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయిం ట్లు నష్టపోయింది. కాగా ప్రస్తుతం సెన్సెక్స్ 79,896 వద్ద కొనసాగు తుండగా నిఫ్టీ 24,301 వద్ద కొనసా గుతుంది. అయితే ఈ నష్టాలు మార్కెట్ (market)సమయాలు ముగిసేసరికి పూడ్చుకుంటాయా లేక పూర్తిగా పతనం అవుతాయో అనేది వేచి చూడాలి.