Minister Bandi Sanjay : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీ య విపత్తు నిర్వహణ సంస్థ అగ్రస్థా నంలో ఉందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమ యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంది స్తున్న సేవలతోపాటు జాతీయ విప త్తుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు ప్రజలకు తెలియజేసేందుకు వి స్త్రతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ విపత్తు నిర్వ హణ సంస్థ అధికారులను కోరారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘సచేత్ (sachet) యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా చైతన్యం కలిగించాల ని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ రె స్క్యూ సిబ్బందికి క్లిష్టమైన సమ యాల్లో రోప్స్, గ్యాస్ కట్టర్స్, జాకె ట్ వంటి మౌలిక సదుపాయాల క ల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.
బుధవారం న్యూఢిల్లీలోని ఎన్డీఎం ఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సంస్థ ప్రధాన కార్యాల యాన్ని కేంద్ర మంత్రి బండి సంజ య్ సందర్శించారు. ఈ సందర్బం గా ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై సంస్థ అందిస్తున్న సే వలను, చేపడుతున్న కార్యాచర ణను అడిగి తెలుసుకున్నారు. ఎ న్డీఎంఏ సేవలకు సంబంధించి కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా అధికారులు వివరించా రు. ప్రధానంగా తెలంగాణ, పంజా బ్, ఢిల్లీ వరదల (2025)తోపాటు సిక్కిం వరదలు, వయనాడ్ ల్యాం డ్స్‌లైడ్, హిమాచల్ వరదల సమ యంలో, బాలాసోర్ రైల్వే ప్రమా దం (2023), సిల్క్యారా టన్నెల్ రక్షణ చర్యల్లో(2023) భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సాహసోపేత చర్యలను వివరించారు.
Yuva Aapda Mitra Scheme కింద NCC, NYKS, BSG, NSS సంస్థల నుండి యువ వాలంటీర్లను చేర్చి, 28 రాష్ట్రాల్లో 2,37,326 వా లంటీర్లు మరియు 1,300 మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వబడింది; ఈ సంస్థలతో కలిసి విపత్తు స్పందన సే వల్లో యువతను భాగస్వామ్యం చే స్తున్నట్లు పేర్కొన్నారు. విపత్తు సేవ లు అందించే విషయంలో జపాన్, రష్యా, జర్మనీ, మాల్దీవులు, చిలీస హా 14 దేశాలతో అంతర్జాతీయ అ వగాహన ఒప్పందాలు చేసుకున్న ట్లు తెలిపారు. అత్యధిక వర్షాలు, వరదలు, విపత్తులకు సంబంధించి న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ‘సచేత్ (sachet)యాప్ ను రూపొందించి నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 13.9 లక్షల డౌన్ లో డ్స్ చేసుకున్నారని పేర్కొన్నారు.ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ విపత్తు వ చ్చే అవకాశం ఉందనే సమాచారం ప్రజలకు తెలుస్తుందని, తద్వారా ఆ విపత్తు నుండి బయటపడే అవకా శాలు ఉంటాయని తెలిపారు. జా తీయ విపత్తు నిర్వహణ సంస్థ అ ద్బుతమైన సేవలు అందిసున్నప్ప టికీ సరైన ప్రచారం లేదన్నారు. కేం ద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుఫా నులు, వరదలుసహా పెను ప్రమాదా లు ఏర్పడిన సమయంలో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్న విషయంపై ప్రజల్లో విస్త్ర త అవగాహన కల్పించాలని కోరా రు.
ముఖ్యంగా సచేత్ (sachet)యాప్ ను దేశ పౌరులంతా డౌన్ లోడ్ చే సుకునేలా విస్త్రత అవగాహన క ల్పించాలని సూచించారు. రెస్క్యూ సిబ్బందికి జాకెట్, రోప్స్, గ్యాస్ కట్టర్స్ వంటి మౌలిక సదుపాయాల ను కచ్చితంగా సమకూర్చాలన్నా రు. దిశ మీటింగ్ లో ఎన్డీఎంఏ సే వలను ఒక అంశంగా చేర్చే అంశా న్ని పరిశీలించాల్సిన అవసరం ఉం దన్నారు. అంతిమంగా “ప్రతి భార తీయుడు – ప్రతి విపత్తుకూ సిద్ధం గా ఉండేలా సంసిద్దులను చేయాల ని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.