Union Minister Gadgari: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ (Union Minister Gadgari)తో సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY), మంత్రుల బృందం భేటీ అయ్యిoది. ఈ మెరకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. బుధవారం సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి బృందo రాష్ట్రా నికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన అంశాలను మీడి యాకు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్‌వర్క్‌కు (Road network) కావాల్సిన అంశాలపై ప్రెజెం టేషన్ ఇచ్చినట్లు తెలిపారు.రీజనల్ రింగ్ రోడ్డుపై లోతుగా చర్చించామ ని వారు దానికి అంగీకరిం చారని వివరించారు. విజయవాడ, హైదరా బాద్ రోడ్డుకు టెండర్లను పిలిచేం దుకు అంగీకరించారని చెప్పారు. హైదరాబాద్ – కల్వకుర్తి రోడ్లు (Hyderabad – Kalwakurti Roads,), ఇతర రోడ్లపై చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదు పాయాలు కలిపిస్తామని నితిన్ గడ్కారీకి చెప్పామని అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలం గాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కారీకి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క (Bhatti Vikramarka) ధన్యవాదాలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.