Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా, డిల్లీ బీసీ సభ గాంధీ కుటుంబo పొగడ్త లకే సరిపోయింది

Union Minister Kishan Reddy :  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీ నగరంలో తెలంగాణ కాం గ్రెస్ నాయకుల బీసీ ధర్నా గాంధీ కుటుంబం పొగడ్తలకే సరిపోయిం దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. డిల్లీ జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పూర్తి సమయo కేటాయించాలని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ కీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు గాంధీ కుటుం బం అనుగ్రహం పొందాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సభ పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

 

సీఎం రేవంత్ రెడ్డి 31 నిమిషాల ప్ర సంగంలో 50 శాతం కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జ పం చేయడానికే కేటాయించాలని కి షన్ రెడ్డి విమర్శల వర్షం గుప్పించా రు. బీసీ రిజర్వేషన్లతో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలం గాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చారు.దాన్ని పూర్తిచేసుకో వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పా ర్టీదేనని పునరుద్ఘాటించారు. అందు కోసం న్యాయపరమైన, చట్టపరమై న అంశాలపై దృష్టిసారించి, చిత్తశు ద్ధితో పనిచేయాలని హితవు పలికా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయలే క బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామం టే చూస్తు ఊరుకోమని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చట్ట పరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా.. కామారెడ్డి డిక్లరేషన్‌ను రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. 18 నెలలు గడుస్తున్న సీ ఎం రేవంత్ రెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొ న్న అంశాల అమలు ఊసెత్తడం లే దని గుర్తు చేశారు.

 

ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మే యడమే అని కిషన్ రెడ్డి విర్శించా రు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి కానీ ఆ దిశగా ఒ క్క అడుగు కూడా ముందుకు పడ లేదని అన్నారు. రజకులు, గౌడ్లు ఇ లా ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుం డా అందరినీ కాంగ్రెస్ నిట్టనిలు వు నా మోసం చేసిందని ఆరోపించా రు.

 

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హిస్తే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరే కత బయటపడుతుందని నిర్వ హించడం లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప సీఎం రేవంత్‌కు బీసీలకు సా ధికారత కల్పించే విషయంలో చిత్త శుద్ధి లేదని ఆరోపించారు. తెలం గా ణలో ధర్నా చేస్తేఎవరూ పట్టించు కోరని ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వే స్తున్నారని ఎద్దేవా చేశారు.

 

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధి కా రంలో ఉన్నా మజ్లిస్ పార్టీ చెప్పిన ట్లు పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా 10 శాతం ముస్లింలను బీసీల్లో చే ర్చి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం కష్ట మేననేది తెలంగాణ స మాజానికి అర్థమైందన్నారు. ఎట్టి పరిస్థితు ల్లో నూ ముస్లింలతో కూడిన బీసీ రిజ ర్వేషన్లను బీజేపీ అంగీకరించదని తేల్చి చెప్పారు. దేశంలో మోదీ నే తృత్వంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందుతోదని కిషన్ రెడ్డి చె ప్పుకొచ్చారు.