Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 10:33 am Posted by : praja deveena

Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యా ఖ్య, ఆయుర్వేదం మన ప్రాచీన వై ద్యవిజ్ఞానం మాత్రమే కాదు, భారతీ య జీవన విధానంలో పూర్తి ఫిలాస ఫీగా చూడాలి 

Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆయు ర్వేదం మనప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్, ఫిజికల్ మెంట ల్ బ్యాలెన్స్ కు సంబంధించిన కంప్లీ ట్ ఫిలాసఫీ గా మనందరం చూడా ల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేను ఆయుర్వేద వై ద్యం తప్ప ఇంటర్ పూర్తయ్యే వర కు కూడా ఆలోపతి టాబ్లెట్ వేసుకొ లేదని, అదే యుర్వేదానికి ఉన్న గొ ప్పతనమని గుర్తు చేశారు. కానీ ఇ టీవల కాలంలో ఆయుర్వేదం కను మరుగయిందని, మోదీ ప్రధాన మంత్రి అయిన 2014 తర్వాత ఆ యుర్వేదానికి ప్రాధాన్యత పెరిగింద న్నారు. వేల ఏళ్ల క్రితం ప్రపంచం కనీ సం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశం సొంతమని, వేల ఏళ్ల క్రితమే ఆపరేషన్లు, కృత్రిమ అ వయవాలు, టాక్సికాలజీ, డయా గ్నస్టిక్ టెస్టులు, కాటరాక్ట్ ఆపరేష న్లు చేసిన ఘనమైన చరిత్ర మన ద ని, అందుకు మనందరం గర్వపడా లని ఆకాంక్షించారు. జాతీయ ఆ యుర్వేద సదస్సు 2025 లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే…

ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్, తెలంగాణ చాప్టర్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

3 దశాబ్దాలుగా ఆయుర్వేదంపై ప్ర జల్లో చైతన్యాన్ని కలిగించడంతో పాటుగా ఈ ప్రాచీన భారత వైద్య వి జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అం దిం చేందుకు అందిస్తున్న ప్రయత్నం ప్ర శంసనీయం. చరకుడు, సుశ్రుతు డు, వాగ్‌భట్టు వంటి ఎందరో మహా నుభావులు ఈ ప్రాచీన భారత వి జ్ఞానం ద్వారా నాటి సమాజానికి వై ద్యం చేశారు.చరక సంహిత, సు శ్రుత సంహిత వంటి గ్రంథాలు.. వై ద్యం, ఆపరేషన్లు మొదలైన వాటి లో యావత్ ప్రపపంచానికి మార్గ దర్శనం చేశాయి.

‘ఫాదర్ ఆఫ్ సర్జరీ’ అయిన సుశ్రు తుడు నాటి కాలంలోనే ఆపరేషన్ల ను చేస్తే చరకుడు ఫిజియాలజీ గు రించి, వివిధ థెరపీల గురించి సమ స్త మానవాళికి జ్ఞానాన్ని అందించా రు.ఇలాంటి మహనీయుల పరిశోధ నల ఫలితంగానే నాటినుంచి నేటి వరకు వైద్య రంగంలో, చికిత్సా రం గంలో భారతదేశం ఉన్నతమైన స్థా నంలో కొనసాగుతోంది. ఇలాంటి గొ ప్ప వైద్య విజ్ఞానాన్ని మరింత ప్రో త్సహించే విషయంలో గత ప్రభు త్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయుర్వేదాన్ని ఓ పాత కాలపు వైద్యంగా, పనికి రానిదిగా.. చూశా రు. కానీ, గత 11 ఏళ్లలో మన ఆ యుర్వేదం పొటెన్షియల్ ప్రపంచా నికి మరోసారి తెలిసింది.

ఆయుర్వేదానికి ఘనమైన గత ప్రా భవాన్ని అందించేందుకు మోదీ ప్ర భుత్వం పనిచేస్తోంది. మనమంతా గర్వపడేలా ఆయుర్వేదాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి.. ‘వెల్‌ నెస్’ విషయంలో భారతదేశాన్ని ప్ర పంచానికి హబ్ గా మారుస్తోంది.

ఆయుర్వేదం అంటే చెట్లు, మూలిక ల ద్వారా మందులు ఇవ్వడం మా త్రమే కాదు. యోగా ద్వారా శారీరక, మానసిక సమతుల్యతను పంచ డం కూడా ఆయుర్వేదమే. ఇవాళ్టి ఈ కాన్ఫరెన్స్ థీమ్ అయిన ‘ఏన్షి యంట్ ఇన్‌సైట్స్ – మోడ్రన్ అడ్వా న్స్‌మెంట్స్’ మోదీ నేతృత్వంలో కేం ద్ర ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద పునర్వైభవం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ దిశగా 2014లో మోదీ ప్రభు త్వం మొదట ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న 6 నెలల్లోనే ఈ విషయంలో మోదీ ఆ యుర్వేదానికి, యోగాకు సరైన గు ర్తింపు తీసుకొచ్చేందుకు తానే ‘అం బాసిడర్’ బాధ్యతలు తీసుకున్నా రు. ప్రపంచదేశాలను ఒప్పించి జూ న్ 21ను అంతర్జాతీయ యోగా ది నోత్సవంగా నిర్వహించేలా చొరవతీ సుకున్నారు. 177 దేశాలు ఇవాళ్టికీ అధికారికంగా ‘యోగా డే’ను నిర్వ హిస్తున్నారు.యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయపెడుతు న్న సమయంలోనూ యోగా ద్వారా మనకు ఎంత భరోసా కలిగిందనేది మీ అందరికీ తెలుసు. అంతే కాకుం డా కరోనా సమయంలో భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలకు రె మెడీస్ గా, హీలర్స్ గా ప్రపంచవ్యా ప్త గుర్తింపు లభించింది. అనేక దేశా లకు పంపించి తమ సాంప్రదాయ వైద్య విధానము యొక్క ప్రాముఖ్య తను తెలియజేస్తుంది కరోనా సంద ర్భంలో ప్రతి ఇంట ఈ వైద్యాన్ని వా డారు

కరోనా సమయంలో భారత దేశం లో వస్తే 50 కోట్ల మంది చనిపోతా రని ఎన్నో మాటలు మాట్లాడారు అవమానించారు ఆరోజు అమిత్ షా గారి ఆధ్వర్యంలో నేనే ఆ టా స్క్ఫోర్స్ కు బాధ్యత వహించాను.

ఆరోజు 140 కోట్ల మంది ప్రాణాల్ని కాపాడిన వైద్య విధానమే ఆయు ర్వేదం. పసుపు వినియోగం పెరగ డం, తిప్పతీగ (గిలోయ్) ద్వారా.. ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా అనుస రించారు.అది ఆయుర్వేదాన్ని, యో గాను ప్రమోట్ చేయడంలో మోదీ సర్కార్ కమిట్‌మెంట్‌‌కు ఒక ఉదా హరణ మాత్రమే. అంతే కాదు ఆత్మ నిర్భర్ భారత్, ‘వికసిత్ భారత్ – 2047’లక్ష్యాల్లోనూ ఆయుష్ మం త్రిత్వ శాఖ ఓ ప్రధానమైన మైన భూమిక పోషించనుంది.

ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించ డం మాత్రమే కాదు. ఈ విషయం లో సృజనాత్మకతను, పరిశోధనల ను ప్రోత్సహిస్తూ.. భారతదేశాన్ని గ్లోబల్ వెల్‌నెస్ కేంద్రంగా మార్చడం లో విశేషమైన ప్రయత్నం జరగనుం ది. ఇందులో మీ అందరి భాగస్వా మ్యం చాలా అవసరం.దాంట్లో భా గంగానే ఆయుర్వేదంలో ఒక భాగ మైన యోగ ప్రపంచానికి అందిం చాం. నేటి యువతరానికి ఆలోచ నలకు అనుగుణంగా యోగాను ఆయుర్వేదాన్ని సులభమైన పద్ద తిలో ఈ ప్రపంచానికి అందించే వి ధంగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుం ది. కానీ నేడు బహుళ జాతి కంపెనీ లు అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదాన్ని పద్ధతుల్ని యోగా ని అణిచివేసేందుకు ప్రయత్నం చే స్తున్నాయి.

ప్రస్తుతం మనకు ఇదొక సవాల్ దీ న్ని తిప్పి కొట్టాలి ఈ సమయంలో మన సాంప్రదాయ వైజ్ఞానిక విద్యని యోగాను కాపాడుకోవాలి. ఆయు ర్వేదానికి వ్యతిరేకంగా ఒక లాబీ ప్ర పంచంలో నడుస్తుంది. ఈ లాబిని తట్టుకొని ఆయుర్వేదానికి ప్రాధాన్య త తీసుకురావాలంటే మనం సమర్థ వంతంగా తిప్పి కొట్టాలి. రాజకీయా లకు సంబంధం లేకుండా యోగాను ఆయుర్వేదాన్ని మనం కాపాడుకో వాలి మన బాధ్యత దానికి మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది

మీరందరు డాక్టర్స్ నేను డాక్టర్ను కాబట్టి ఉపాధి కోసం పనిచేయాల ని ఆలోచనాలిని పక్కన పెట్టి ఇది మన దేశ సంపద ఇది మన జీవన విధానం భారతీయ వైద్యం అని మ న భావితరాలకు దీన్ని అందిం చాల నే సంకల్పం తో పని చేయాలి.

ఆయుర్వేదాన్ని కాపాడుకుంటూ ఆ యుర్వేదాన్ని మనందరికీ అందిస్తు న్న ఎంతోమంది గురువులు మహా నుభావులకు అండగా నిలబడాలి

రామ్ రాందేవ్ బాబా లాంటి వాళ్లు కొన్ని మందులు తీసుకొస్తే దానిపై సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకు నే ప్రయత్నం చేసారు.ఇలాంటి సమ యంలో మన సంస్కృతిని పరిరక్షిం చుకునే దాంట్లో భాగంగా కచ్చితం గా మనం మాట్లాడాలి మనం అడ్డు కోవాలి వారికి అండగా నిలబడాలి.

జూన్, 2016లో, అమెరికా కాంగ్రెస్‌ లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడు తూ యోగా భారతదేశపు ప్రాచీన విజ్ఞానమే అయినా దీనిపై.. మేం ‘మేధో సంపత్తి హక్కు’ (ఇంటెలెక్చు వల్ ప్రాపర్టీ రైట్ – IPR) తీసుకోలేదే ని గుర్తుచేశారు.

మానవాళి శారీరక, మానసిక ఆరో గ్యానికి అవసరమైన యోగాను యావత్ ప్రపంచానికి అందించాల న్న లక్ష్యంతోనే తాము IPR తీసు కోలేదన్నారు.శాంతియుత, ఆరోగ్య ప్రపంచ నిర్మాణం కోసం భారతదేశం అందిచిన కానుక ‘యోగా’ అని చా లా సందర్భాల్లో మోదీ చెప్పారు.

ఆయుష్ మినిస్ట్రీ ద్వారా ఆయుర్వే దం, యోగా తోపాటుగా.. నేచురో పతి, యునాని, సిద్ధ వైద్యం, సోవా -రిగ్పా, హోమియోపతి వంటి వాటి కి ప్రోత్సాహం అందిస్తున్నాం. ఇందు కు తగ్గట్లుగా పాలసీల్లో మార్పులు తీసుకొస్తూ జనాల్లో చైతన్యం క ల్పించడం, ప్రజల దైనందిన జీవితం లో ఆయుర్వేదాన్ని ఓ భాగంగా మ లిచేందుకు ప్రయత్నం జరుగుతోం ది.

నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) ద్వారా విశేషమైన పని దేశవ్యాప్తం గా జరుగుతోంది. మన తెలంగాణ లోనూ ఈ NAM మిషన్ కింద

సిద్దిపేట, వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ని ర్మాణం జరిగింది.ఈ కేంద్రాల ద్వా రా యోగా, నేచురోపతి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. వీటి ఏర్పాటుకు ఆ యుష్ మంత్రిత్వ శాఖ ఒక్కో కేంద్రా నికి రూ.15 కోట్లు మంజూరుచేసిం ది.రూ.10 కోట్లు భవనాల నిర్మాణా లు, మౌలికవసతుల కల్పనకు రూ. 5 కోట్లు ఎక్విప్‌మెంట్, నిపుణుల నియామకం కోసం కేటాయిoచింది.

మన హైదరాబాద్ లోని రామంత పూర్‌లోనూ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

దీనికి అవసరమైన భూసేకరణను పూర్తిచేసి అవసరమైన DPRను రా ష్ట్ర ప్రభుత్వం అందించాలని ఈ వే దిక ద్వారా కోరుతున్నాను.ఇప్పటికే తెలంగాణలో 420 ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ప్రజలకు వై ద్యసేవలు అందిస్తున్నాయి.440 ఆయుష్ డిస్పెన్సరీల్లో 224 ఆయు ర్వేదం,122 యునానీ, 94 హోమి యపతి కేంద్రాలున్నాయి.ఇవి కా కుండా 366 NRHM డిస్పెన్సరీలు కూడా తెలంగాణలో ఉన్నాయి.

ఇందులో 199 ఆయుర్వేదం 62 యునానీ,105 హోమియోపతి డిస్పెన్సరీలున్నాయి.మొత్తం 7.5 లక్షల మంది రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీ షనర్లు ఆరోగ్య భారత నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఆయుష్ మిని స్ట్రీని బలోపేతం చేసేందుకు, ప్రజా రోగ్య వ్యవస్థ పటిష్టానికి ‘హోల్ ఆ ఫ్ గవర్నమెంట్ అప్రోచ్’తో కేంద్ర ప్ర భుత్వం పనిచేస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణలో ఆ యుష్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్.. రూ.16.05 కోట్లు కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతు న్న ఇలాంటి వివిధ కార్యక్రమాల కారణంగా 2014లో 3 బిలియన్ డాలర్లున్న (రూ. 26.5 వేల కోట్లు) ఆయుష్ మ్యానుఫాక్చరింగ్ సె క్టా ర్ కేవలం ఒక దశాబ్ద కాలంలోనే.. 8 రెట్లు పెరిగి.. 24 బిలియన్ డాలర్ల కు (రూ. 2.12 లక్షల కోట్లు) చేరు కుంది.భారతీయ లోకల్ మెడిసి నల్ ప్రోడక్ట్స్ తయారీతోపాటుగా.. ఈ రంగంలో స్టార్టప్స్ కారణంగా.. అంతర్జాతీయ వెల్‌నెస్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కు డిమాండ్ పెరిగింది. అందుకే, ఇవాళ మోదీ నేతృత్వంలో ఆయుర్వేదం భార తదేశపు ‘సాఫ్ట్ పవర్’గా.. ప్రపం చ వ్యాప్తంగా ‘గుడ్‌విల్’ను పెంచు తూ కల్చరల్ డిప్లమసీకి బాటలు వేస్తోం ది.మన పెద్దలు చెప్పిన ‘వసుధైవ కుటుంబకం’ నినాదాన్ని మనసా, వాచా, కర్మణా పాటిస్తూ ప్రపంచా నికి జ్ఞానాన్ని పంచుతున్నాం.

ఇవాళ 100కు పైగా దేశాల్లో ఆయు ర్వేదాన్ని ‘ప్రివెంటివ్ కేర్’గా వాడు తున్నారు. ఇది మనందరికీ గర్వ కారణమన్నారు. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వెల్‌ నెస్ సెంటర్లలో చికిత్స పొందేదు కు వివిధ దేశాల పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ‘ఆయుష్ వీసా’లద్వారా మెడికల్ టూరిజాన్ని పెంచడంపైనా దృష్టి సారించాం.

మన్ కీ బాత్ లోనూ.. ప్రధానమంత్రి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించారు.

వేలమంది భారతీయులు నివసిం చే పరాగ్వే దేశంలో, భారతీయ ఎం బసీలలో స్థానికురాలైన ఎరికా హ్యూబర్ ఆయుర్వేద కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న విషయాన్ని మోదీ ప్ర స్తావించారు.మన హైదరాబాద్ ఇ ప్పుడు ప్రపంచ మెడికల్ హబ్ గా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇక్కడున్న ప్రపంచస్థాయి వైద్య సేవ లు, ఫార్మా కంపెనీల కారణంగా.. మనకు ఈ గుర్తింపు లభిస్తోంది.

దీ న్ని మరింతగా ముందుకు తీసు కెళ్లేందుకు.. ఆయుర్వేద ఆధారిత స్టార్టప్‌ కంపెనీలు, న్యూట్రాసూ టికల్ ఇండస్ట్రీస్ (బేసిక్ న్యూట్రిష న్ కు అదనంగా పోషకాలు అందిం చే ఫుడ్ తయారు చేసే కంపెనీలు), ఆయుర్వేదంలో పరిశోధనా సంస్థ లకు మరింత అవకాశం ఉంది.

ఆధునిక అలోపతిక్ వైద్య వ్యవ స్థతో ప్రాచీన ఆయుర్వేదాన్ని జో డించి వైద్యం చేసే అవకాశాలు రా నున్న రోజుల్లో మరింతగా పెరుగు తాయి.దీన్ని మరింతగా ప్రోత్స హిం చేందుకు, New Education Pol icy లోనూ AYUSHకు సరైన ప్రాధా న్యత కల్పించింది మోదీ ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా ‘ఆయుష్ గ్రామ్’ల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో ఆయు ర్వేద ప్రాక్టీషనర్లకు మద్దతు లభి స్తోంది.అంతే కాకుండా.. IIT, IIS (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్), JNU వంటి యూనివర్సి టీల్లో Ayush Centres of Exc ellence ఏర్పాటయ్యాయి. ఇలాం టి ఎన్నో కార్యక్రమాల ద్వారా మన ప్రాచీన వైద్య విధానాన్ని ప్రోత్సహిం చేందుకు కేంద్రం కృషిచేస్తోంది.

ఇవాళ్టి కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయుర్వేద విభాగం మేధావులు, ప్రాక్టీషనర్లకు నాదొక విన్నపం.

ఆధునిక శాస్త్ర, విజ్ఞానానికి మన ప్రాచీన జ్ఞానాన్ని జోడించేందుకు ఇదే సరైన సమయం.ఇందుకోసం వివిధ ఇంటర్నేషనల్ జర్నల్స్, సైం టిఫిక్ మ్యాగజైన్స్ లో.. మీ ఆలో చనలను, మీ పరిశోధనలను పం చుకోండి. భారతదేశంతోపాటుగా.. ప్రపంచంలోని మారుమూల ప్రాం తాల వరకు కూడా ఆయుర్వేదాన్ని విస్తరించడంలో కీలక బాధ్యత తీసుకోండి.2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్న ప్ర యత్నంలోఆరోగ్య భారత నిర్మాణం కూడా మన సంకల్పంలో భాగం కా వాలి. ఇందుకోసం ‘ఆయుష్’ విభా గం కీలకమైన పిల్లర్ కావాలి. ‘ఆరో గ్యమే మహాభాగ్యం’ అన్న మన పె ద్దలు చెప్పిన మాట స్ఫూర్తితో.. మ నమంతా కలిసి పనిచేద్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి విశ్వ ఆయుర్వేద పరిషత్, తెలం గాణ చాప్టర్ వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా నా

ని వ్యాఖ్యానించారు.