
ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో “వికసిత్ భారత్ జి రా మ్ జి”పథకాన్ని సమర్థ వంతం గా అమలు చేయడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లాల్ చంద్ మా జిల్లా యంత్రాంగాన్ని అభి నందించారు.మంగళవారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలో పనిచేసే జాయిం ట్ సెక్రెటరీ లాల్ చంద్ మా, అం డర్ సెక్రెటరీ రాజీవ్ రాణా, అసి స్టెంట్ డైరెక్టర్ నీతూలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నల్గొం డ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకం నుండి “వి క సిథ్ భారత్ జిరాంజీ” పథకంగా మారిన తర్వాత పథకం అమలు లో ఇబ్బందులు, సాంకేతిక సమ స్యలను అధ్యయనం చేసే నిమి త్తం జిల్లాకు వచ్చింది.
ముందుగా జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ను ఈ బృందం కలిసి ఉపాధి హా మీ పథకం నుండి వికసిత్ భార త్ జీరాంజి పథకంగా మార్పు చెందిన తర్వాత దేశ వ్యాప్తంగా ఆయా జిల్లాలలో పథకం అమ లుపై ముఖ్యంగా ప్రత్యేకించి ట్రా న్స్మిషన్ సమస్యలను తెలుసుకు నేందుకు పర్యటిస్తున్నట్లు తెలి పింది.అనంతరం వికసిత్ భారత్ జి రామ్ జి పథకంపై జిల్లా, మం డల,జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అ వగాహన కార్యక్రమంలో జాయిం ట్ సెక్రెటరీ మాట్లాడుతూ నల్గొం డ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా “వికసిత్ భారత్ జీరాం జి” పథకాన్ని బాగా అమలు చే స్తున్నారని అన్నారు.వికసిత్ భా రత్ జీ రాంజీ పథకం కింద కూలీ లు ఒకరోజు కూడా పని లేకుం డా , వేతనం లేకుండా ఉండకూ డదన్నదే కేంద్ర ప్రభుత్వ అభిమ తమని, అడిగిన వారందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ జిరాంజి పథకాన్ని అమ లు చేస్తున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకంతో పోలిస్తే జీ రామ్ జి లో పని దినాలను 100 నుం డి 125 కు పెంచడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో కొత్త గా వచ్చిన వికసిథ్ భారత్ జీరాం జీ పథకంపై అం దరికీ అర్థమయ్యే విధంగా కళా జాత బృందాల ద్వారా,ఇతర మార్గాల ద్వారా ప్రచార సామాగ్రి ద్వారా అవగా హన కల్పించడం అభినందనీ యమని, అంతేకాక వివిధ రకాల కార్యక్రమాలు నిర్వ హించడం పట్ల కూడా ఆయన జిల్లా యంత్రాంగాన్ని అభినందిం చారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీ వోలు, ఏపీవోలతో విక సిత్ భారత్ జీ రామ్ జి పథకం అమలు పై అభిప్రాయాలను, స మస్యలను అడిగి తెలుసుకున్నా రు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లాడుతూ నల్గొండ జిల్లాలో విక సిత్ భారత్ జి రాంజీ పథకంపై స ర్పంచ్ మొదలుకొని గ్రామపంచా యతీ కార్యదర్శి వరకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింద ని, కళాజాత ద్వారా ప్రత్యేక ప్ర చార రతాలను ఏర్పాటు చేసి గ్రా మాలలో ప్రజలకు జి రాంజీ పథ కంపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు .ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావం వల్ల పని లేక కూలీలు చాలా ఇబ్బందులు ప
డుతున్నారని, ఇలాంటి సమ యంలో వికసిత్ భారత్ జీ రామ్ జి పథకం కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వర్ష పాతం తక్కువగా ఉన్న ప్రదేశాల లో కూలీలను ప్రోత్సహించేందు కు ఈ పథకం బాగా ఉపయోగప డుతుందన్నారు.వికసిత్ భారత్ పథకం స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ ము రళి రాష్ట్ర,జిల్లా గణాంకాలను కేంద్ర బృందం ముందు ఉంచారు.
ఈ సందర్భంగా పలువురు ఎంపీ డీవోలు, ఏపీఓలు మాట్లాడుతూ జి రాంజీ పథకంలో పనిదినాలు పెంచడం, అలాగే ఎక్కువ పనుల ను చేర్చడం పట్ల కూలీలు సంతో షంగా ఉన్నారని తెలిపారు. అ యితే స్థానికంగా నిర్మాణ పనుల ను జిరాంజీ పథకంలో చేర్చాల ని, హర్టికల్చర్, బావులు తదితర పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల సీలింగ్ నిబంధన తొలగించా ల ని, జిరాంజీ పథకం కింద మొదటి బిల్లు చెల్లించిన తర్వాతే రెండవ బిల్లు అప్లోడ్ చేసేందుకు అవకా శం ఉన్నందున బిల్లుల చెల్లింపు లు ఆలస్యాన్ని నివారించేలా సా ఫ్ట్వేర్ రూపొందించాలని, కూరగా యల పందిళ్ళు వేసుకునేందుకు జి రాంజీ పథకం కింద అవకాశం కల్పించాలని, అంగన్వాడీ భవ నాల మరమ్మతులు చేపట్టేందు కు జిరాంజీ పథకం కింద అవకా శం కల్పించాలని కోరారు. అంతే కాక వికలాంగులకు ఎక్కువ పని దినాలు ఇవ్వాలని, సామూహి కంగా కూలీలు పని చేసుకునేం దుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వికసిథ్ భారత్ జి రామ్ జి పై రూపొందించిన గోడ పత్రికలను వీరావిష్కరించారు.రాష్ట్ర గ్రామీ ణాభి వృద్ధి శాఖ జాయింట్ కమి షనర్ శేషు, స్థానిక సంస్థల ఇం చార్జ్ అదపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి డి ,డిఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్ , పంచా యతీ రాజ్ ఈ ఈ గిరిధర్, తది తరులు ఈ కార్యక్రమానికి హాజర య్యారు.
*జిల్లా ప్రజలకు నాణ్యమైన వై ద్యం అందించాలి*
నల్లగొండ: జిల్లా ప్రజలకు మెరు గైన, నాణ్యతతో కూడిన వైద్య సే వలు అందించేందుకు అవసరమై న ఆధునిక వైద్య పరికరాలను స మకూర్చాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంబంధిత అధికారు లను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ చంబర్ లో నిర్వ హించిన హాస్పిటల్ డెవలప్‌మెం ట్ సొసైటీ (HDS) సమావేశం జ రిగింది. ఈ సమావేశంలో సర్జరీ, ఈఎన్‌టీ, లాపరోస్కోపీ, రేడి యాలజీ, జనరల్ మెడిసిన్, గైన కాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, జనరల్ సర్జరీ, బ్లడ్ బ్యాంక్, నేత్ర వైద్యం (ఆఫ్తాల్మాలజీ) తదితర విభాగాల పనితీరు, అవసరమైన పరికరాలపై సమీక్ష నిర్వహించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన నా ణ్యమైన సర్జికల్ పరికరాలు, ఆ ధునిక వైద్య ఉపకరణాలు కొను గోలు చేసి ప్రజలకు మెరుగైన వై ద్య సేవలు అందించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో చేతులు, కాళ్లు కో ల్పోయిన వారికి జిల్లా స్థాయి లోనే కృత్రిమ అవయవాలు (జై పూర్ లెగ్స్, కృత్రిమ చేతులు) త యారు చేసి అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని చెప్పారు.
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఫాస్ట్ ఫుడ్ వినియో గం కారణంగా అనారోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని పే ర్కొంటూ, ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచాలని, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని వైద్యులు, ము న్సిపల్ అధికారులు కలిసి చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
పిల్లలకు ప్రత్యేక ఎక్స్‌రే సదుపా యం కల్పించడంతో పాటు అవ సరమైన రేడియాలజీ సేవలను విస్తరించాలని సూచించారు. అ లాగే ప్రతి విభాగాధిపతికి ఒక కం ప్యూటర్ ఏర్పాటు చేసి, రోగుల వైద్య చరిత్రను డిజిటల్ రూపం లో నమోదు చేసే విధంగా చర్య లు తీసుకోవాలని తెలిపారు.
బ్లడ్ బ్యాంక్, డెంటల్, నేత్ర వైద్య విభాగాల్లో అవసరమైన పరికరా లు, మందులు, ఇతర సామగ్రి ఏ వైనా ఉంటే వెంటనే ప్రతిపాదన లు పంపాలని, వాటి కొనుగోలు కు చర్యలు తీసుకుంటామని క లెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావే శంలో వైద్యులు రెండు ఐసీయూ వెంటిలేటర్ల అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటి ఏ ర్పాటుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థోపెడిక్, ఫిజి కల్ మెడిసిన్ విభాగాల్లో అవస రమైన ఆధునిక సదుపాయాలు, లిఫ్ట్ ఏర్పాటు వంటి ప్రతిపాదన లను కూడా పరిశీలించాలని అధి కారులకు ఆదేశించారు.
మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతా ల నుంచి ఆసుపత్రికి వచ్చేజిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సే వలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమై న అన్ని సదుపాయాలను దశల వారీగా కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ అధికారి రాహుల్, మె డికల్ కళాశాల ప్రిన్సిపల్ జి. స త్యనారాయణ,డి సి హెచ్ మా తృ నాయక్, సూపరింటిండెంట్ డాక్టర్ జయలత, డిప్యూటీ సూ పరిం టిండెంట్ డాక్టర్ అరుంధతి ఐఎo ఎ అధ్యక్షుడు డాక్టర్ రమే ష్,హె చ్ ఓడిలు, అధికారులు పాల్గొన్నారు.








