Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

UPSC: యూపీఎస్సీ మెయిన్స్ తేదీల ప్రకటన

UPSC: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: యూపీ ఎస్సీ సివిల్ సర్వీసెస్ (UPSC Civil Services) మెయిన్ ఎగ్జామినేషన్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. మెయిన్ పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో (preliminary examination) విజయం సాధించిన తర్వాత ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు యుపిఎస్ సి అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ పరీక్షను (Main Exam) సెప్టెంబ‌ర్ 20, 21, 22, 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా నిర్వ‌హిం చ‌నుంది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించను న్నారు.మెయిన్స్ ఎగ్జామ్ 2024 పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లు (Admit Card)డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనున్నారు. దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ప‌రీక్ష టైం టేబుల్ సెప్టెంబర్ 20న ఎస్సే, సెప్టెంబర్ 21న జనరల్ స్టడీస్ I మరియు II,సెప్టెంబర్ 22న జనరల్ స్టడీస్ III మరియు IV,సెప్టెంబర్ 28న ఇండియన్ లాం గ్వేజ్ అండ్ ఇంగ్లీష్, సెప్టెంబర్ 29న ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 , పేపర్ 2 పరీక్షలు