Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Urea Shortage : యూరియా కష్టాలు, ఎరువులొచ్చిoది 440 బస్తాలు, బారులు తీరింది సుమారు 3వేల మంది రైతులు

Urea Shortage : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఆరుగా లం కష్టించి పంటలు పండించి ప్రజ లకు అన్నం అందించే రైతన్నలు స ద్దులు కట్టుకొని ఎరువుల కోసం దు కాణాల ముందు పడిగాపులు కా స్తూ కనీసం అన్నం తినడానికి కూ డా సమయం లేని పరిస్థితుల పట్ల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సం ఘం సొసైటీ ఎరువుల దుకాణం లోకి 440 బస్తాల యూరియా రావ డం జరిగింది. యూరియా కోసం సోమవారం నుండి సొసైటీ వద్దనే అన్నం తెచ్చుకుని అక్కడనే తిని రాత్రి సైతం ఆరు బయట నిద్రించి తెల్లవారి ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడిన రైతులకు నిరాశ ఎదురవుతుంది.

తెల్లవారేసరికి సుమారు 3000 మంది రైతులు సొసైటీ ఎరువుల దుకాణం ముందు బారులు తీర డంతో గత రాత్రి నుండి పడిగాపు లు కాసిన రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైతులు పెద్ద ఎత్తున రావడంతో నాగారం తుంగ తుర్తి రోడ్డు పై వాహనాలు రాకపో కలకు ఇబ్బందికరంగా మారింది. ముందుగా కొంతమందికి టోకెన్లు ఇవ్వడంతో టోకెన్లు ఇచ్చేవైపు ఒ క్కసారిగా రైతులను దూసుకెళ్లారు. దీనిని గమనించిన అధికారులు టో కెన్ల ప్రక్రియను ఆవేశారు. క్యూలైన్ లోకి మళ్ళీ రైతులు వెళ్లడం ముం దున్న రైతులు వెనుకకు వెనుకున్న రైతులు ముందుకు తారుమారు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతులను అదుపులో ఉంచడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు.

ఒకపక్క మహిళా రైతులు మరోక వృద్ధులు కొంతమంది వికలాంగ రై తులు ఎరువుల కోసం రావడంతో అధికారులకు ఇబ్బందిగా మారిం ది .చాలినంత యూరియా వస్తుంద ని రైతుల ఇబ్బందులు గట్టెక్కుతా యని అధికారులు చెబుతున్న వ చ్చే యూరియా రైతులకు ఏ ఊరికి సరిపోవడం లేదని 10 ఎకరాలు నాటు పెడితే రెండు బస్తాల యూరి యా ఇస్తే వ్యవసాయం ఎలా చేయా లని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. తాము వ్యవసాయం మీద ఆధారపడి జీవితాలను గడుపుతు న్నామని వరుణుడు కరుణించిన ప్ర భుత్వాలు మాత్రం సహకరించడం లేదని తమ కావాల్సిన ఎరువుల ను సకాలంలో సరఫరా చేయడం లో విఫలమవుతున్నారని పలువు రు రైతులు అంటున్నారు.

యూరియా వేసే అదను పోతే పం ట దిగుబడి తగ్గుతుందని తాము పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు కూ డా రావని రైతులు అంటున్నారు. తమ వ్యవసాయ కాలమంతా యూరియా కోసం తిరగడానికి సరి పోతుందని కనీసం అన్నం తినడా నికి కూడా సమయం దొరకకుండా క్యూ లైన్ లో నిలబడవలసి వస్తుం దని పలువురు రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు .యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి అటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం ఏ విధమైన సూచనలు ఇస్తారు రైతులకు ఎలా యూరియా అందిస్తారు అని పలు వురు రైతులు ప్రశ్నిస్తున్నారు.

తుంగతుర్తి మండలం లో సుమారు 20 కి పైగా ఎరువుల దుకాణాలు ఉండగా యూరియా మాత్రం ఏదో ఒక్క దుకాణానికి వస్తే ఎలా సరిపో తుందని రైతులు అంటున్నారు. ఇ ప్పటికైనా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని చాలినంత యూరి యా ఎక్కువ దుకాణాలకు సరఫరా అయ్యేలా చూడాలని అప్పుడే రై తులు సులభంగా యూరియా తీ సుకోగలుగుతారని యావత్ రై తాం గం కోరుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పంట దిగుబడితి తగ్గి రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. మరి ప్రభుత్వం రైతుల ఆవేదన ఏ మేరకు తీరుస్తుందో వేచి చూడా ల్సిందే.