BJP Venkatramaiah : ప్రజా దీవెన, కోదాడ: రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సప్లై చేయాలి అని బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనగాల వెంకటరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో పార్టీ కార్యాలయంలో కిసాన్ మోస్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలేవోలు చిట్టిబాబు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఎరువుల విషయంలో అసంబద్ధమైనటువంటి ఒక ప్రకటనలు చేయడం వల్ల రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ మొత్తం గందరగోళంగా తయారైంది. యూరియాను బ్లాక్ మార్కెట్ కి అదేవిధంగా కృత్రిమ యూరియా కొరతకి పరోక్షంగా కారణమైన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయం అన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మొత్తంలో కూడా వ్యవసాయ రంగాన్ని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు అన్నారు.
గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి ఎరువుల విషయంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు అయినాయి ఎరువుల కోసం దుకాణాల వద్ద గోదాముల వద్ద పోలీసులతో లాటి చార్జీలు జరగడం కాకుండా రైతులకి గాయాలైనటువంటి పరిస్థితి ఒక కట్ట యూరియా తీసుకోవాలంటే చెప్పులు లైనులో నిలబడిన పరిస్థితులు ఉన్నాయన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఎరువుల విషయంలో ఏనాడు కూడా కొరత రాకుండా సఫీషియెంట్ గా ఉండే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఖరీఫ్ గాని రబి గాని కావాల్సిన ఎరువులు పథకం ప్రకారంగా దశలవారీగా పంపించేటటువంటి ఒక ఆనవాయితీ నరేంద్ర మోడీ చేశారు అని తెలిపారు. యూరియాను అధిక మొత్తంలో ప్రాథమిక సహకార సంఘాలకు సప్లై చేసిట్లయితే ఈ పరిస్థితి రాకుండా ఉండేది అన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు రిటైల్ డీలర్లకి వాళ్ళు దగ్గరకు సప్లై చేయాల్సినటువంటి అవసరం చేయాలి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా రైతులకు ఇబ్బంది లేకుండా సప్లై చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనికి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులని వెంటనే ఆదుకోవాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కనగల నారాయణ, నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య సిహెచ్ శ్రీనివాస్ మునగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.