–అధికారిక ప్రకటన వెలువడకపో యినా మనమ్మాయికి మద్దతు, ట్రంప్ కు బ్రేకులు
–పోల్ సర్వేలో రెండు శాతంతో ముందంజలో కమలా హారీస్
–ఇంకా ప్రచారాన్ని ప్రారంభించకు న్నా కమలా హారిస్ దూకుడు
–ఈ పాటికే ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించిన డెమోక్రాట్స్
US presidential election:ప్రజా దీవెన, వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవం బర్ 5న జరుగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుం టున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డెమొక్రాట్ అభ్య ర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం దాదాపు ఖరా రైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువగానే ప్రతిని ధులు ఆమెకు మద్దతును ప్రకటిం చారు. ఇటీవల డెలావెర్‌లో ప్రచార ప్రధాన కార్యాలయాన్ని సందర్శిం చారు. బిడైన్(Bidine) ప్రచార బృందంతో భేటీ అయ్యారు. అదేబృందంతో కలిసి పని చేయనున్నట్లు ప్రకటిం చారు. ఎన్నికలకు సమయం మూడు నెలలే ఉందని గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రెండు రోజులలో అమె అభ్యర్ధిత్వం పై అధికార ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్ (Kamala Harris)తన ఉపాధ్యక్ష మేట్ ఎంపికలో తలము నకలై ఉన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పేర్లను ఈ వారంలో ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా కమలా హారి స్ బరిలో నిలుస్తుండడంతో ఎన్నిక ల్లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తు న్నారు. తాజాగా ఓ సర్వే కీలక రిపోర్ట్ విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే కమలా హారి స్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఐపీఎస్ఓఎస్ నేషనల్ పోల్స్ ప్రకారం ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో నిలి చారు.
బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటిం చిన అనంతరం సోమ, మంగళవా రాల్లో ఈ పోల్ జరిగింది. తాజాగా నిర్వహించిన సర్వేలో డోనాల్డ్ ట్రంప్‌కు 42శాతం మంది మద్దతు తెలుపగా కమలా హారిస్‌కు (Kamala Harris) 44 మందిశాతం అండగా నిలిచారు. దాంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును కూడగు డుతన్న సమయంలో సర్వేలో ఉపా ధ్యక్షురాలికి అనుకూలంగా సర్వే ఫలితం వచ్చింది. ఇంతకు ముందు ఈ నెల 15-16 మధ్య జరిగి సర్వేలో ట్రంప్ 44శాతం జులై 1-2 మధ్య జరిగిన సర్వేలో డోనాల్డ్ 45 పాయింట్లతో ముందంజలో నిలిచారు.ప్రస్తుతం కమలా హారిస్ మద్దతు పెరుగుతోందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. పోల్స్టర్ టోనీ ఫాబ్రిజియో మాట్లాడుతూ హారిస్ ప్రజాదరణ పెరగడం కొంతకాలం పాటు కొనసాగు తుందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేల్లో 56శాతం మంది ఓటర్లు కమలా హ్యారిస్ (Kamala Harris)అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపించారు. మానసికంగా ధృడంగా ఉండగలరని.. సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఆమెకు ఉందని అమెరికన్లు భావిస్తున్నారు.
పీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం.. మొత్తం అమెరికన్లలో 87 శాతం మంది ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని బిడెన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని భావించారు. 41 శాతం మంది బిడెన్ నిర్ణయంతో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇక కమలా హరీస్ ప్రచారం ప్రారంభిస్తే ట్రంప్ క్రమం క్రమంగా ఓట్ల శాతం పడిపోవచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తున్నది.