ట్రంప్ కీలక వ్యాఖ్య, మూడో ప్రపంచయుద్ధం తధ్యం
USADonaldTrump : ప్రజా దీవెన, వాషింగ్టన్: ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం రావడం తప్పదని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సం చలన వ్యాఖ్యలు చేశారు. అమెరి కాతో మైనింగ్ ఒప్పందానికి ఉక్రెయి న్ నిరాకరించడమే ఆ యుద్ధానికి బీజం వేస్తుందని అభిప్రాయపడ్డా రు. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ‘రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా నిలువరించకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. వేలు, లక్షలాది మరణాలు సంభ వించ కుండా అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. గత కొన్ని వారాల నుంbచి యూరప్ లో, రష్యాలో ఏం జరుగుతుందో ప్రపంచం మొ త్తం గమనిస్తుంది. అమెరికా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దకపోతే కనుక మూడో ప్రపంచ యుద్ధం జరగక తప్పదనిపిస్తోందన్నారు.
ఉక్రెయిన్ మీద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడులు కొన సాగిస్తూనే ఉంటారు. ఈ దేశాల మధ్య యు ద్ధం ముగిసేవరకు ర ష్యా మీద సై తం టారిఫ్ వార్ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి వస్తే కనుక రష్యాకు కాస్త ఊరట కలిగిస్తాం. రష్యా, ఉక్రెయిన్ తమ యుద్ధానికి స్వస్తి పలికేందుకు మార్గాలు అన్వే షించాలని ఇరు దేశా లకు సూచించా. ఇప్పటికే చాలా ఆలస్యమైంద ని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో కీలక ప్రకటనను పోస్ట్ చేశారు.