Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

UTF: వ్యక్తిగత అవసరాల కోసం డిప్యుటేషన్లు చేయడం మానుకోవాలి

–పిఆర్సి గడువు తీరినందున రిపోర్టును వెంటనే అమలు చేయాలి

–యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

–ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామని పిలుపు

UTF: ప్రజాదీవెన నల్గొండ : ప్రభుత్వ విద్యా రంగం పటిష్ట పరచడంలో టియస్ యుటిఎఫ్ సంఘ సభ్యులు ముందు ఉండాలని, టీఎస్ యుటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆ సంఘ అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి అధ్యక్షతన సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈవిద్య సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు సకాలంలో అందించి నందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల అవసరమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అలా కాకుండా జిల్లా కేంద్రానికి, హైవే లకు దగ్గర్లో గల ప్రాంతాలకు ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం డిప్యుటేషన్లు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


తీరు మారకపోతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు. పిఆర్సి గడువు తీరినందున పిఆర్సి రిపోర్టు వెంటనే తెప్పించుకొని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరో రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి మాట్లాడుతూ జూలై చివరి నాటికి సంఘ సభ్యత్వం పూర్తి చేయాలని జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, బి. అరుణ కోశాధికారి వడిత్య రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, గేర నరసింహ, యాట మధుసూదన్ రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, చిన వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, ఆడిట్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, నర్సింహ్మ మూర్తి, భాను ప్రకాష్, గిరి యాదగిరి, యరనాగుల సైదులు, శ్రీలత, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.