— వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం చేయాలన్నదే తమ ప్రభు త్వ ఆకాంక్ష అని, అందులో భాగం గానే తెలంగాణలో 96.9 శాతం కు లగణన సర్వే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికా రులు సమర్పించారని తెలిపారు. తెలంగాణలో 50 రోజుల పాటు కు లగణన సర్వే జరిగిందని,1,03, 8 89 మంది అధికారులతో ప్రభు త్వం కులగణన సర్వే చేయించిం ది. 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారు.
3.1 శా తం మంది సర్వేలో పాల్గొన లేదని కమిషన్ స్పష్టం చేసింది. 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు అధికారు లు వెల్లడించారు. తెలంగాణలో 55.85శాతం బీసీ జనాభా ఉన్నట్లు కమిటీ నివేదికలో ప్రకటించింది. తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెనుకబ డిన వర్గాలకు న్యాయం చేయాల న్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.ఏఐసీసీ అగ్రనేత రాహు ల్గాంధీ ఆశయం మేరకు సామాజి క, కులగణన సర్వే చేశామని అ న్నారు. కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన సర్వే నివేదిక అందిందని చెప్పారు.
తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని చెప్పు కొచ్చారు. 3.1 శాతం మంది సర్వే లో పాల్గొనలేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదని అన్నారు. బీసీ జనాభా లెక్కించాల నేది రాహుల్ ఆశయమని చెప్పా రు. 1,03,889 మంది ఎన్యుమరే టర్లతో కులగణన సర్వే జరిగిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.54 కోట్ల మందిని సర్వే చేశారని చెప్పారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 4న కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు.
అసలైన పేదలను గుర్తిం చేందుకే కులగణన చేపట్టామని వి వరించారు. బలహీన వర్గాల అ భ్యున్నతి కోసమే కులగణన జరి గిందని తెలిపారు. కులగణన సర్వే నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతామ ని అన్నారు. అసెంబ్లీ తీర్మానమైన తర్వాత బలహీన వర్గాల స్థితిగతు ల మెరుగు కోసం చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి పేర్కొన్నారు.
కులగణన సర్వే నివేదిక ఆమో దంతో ముందడుగు … తెలంగా ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కులగణన నివేదికను ఆదివారం మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబి నెట్ సబ్ కమిటీకి అందజేశారు. రా ష్ట్ర ప్లానింగ్ కమి షన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సు ల్తానియా బృం దం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి కులగణన కు సంబంధించిన నినే ధికను ఆదివారం సచి వాలయం లో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కులగణన నివేది కను అందుకున్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన తెలంగాణలో దాదా పు 50 రోజుల పాటు కొనసాగింది. ఈ సర్వేలో దాదాపు 76 ప్రశ్నలతో కూడిన సర్వేను నిర్వహించి రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు పాటు అన్ని వివ రాలను సేకరించారు.ఈ సర్వేలో మొత్తం 3,889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9 శాతం కుటుం భాలను అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం తెలంగాణలోని 3 కోట్ల 54 లక్షల మంది తమ వివ రాలను నమోదు చేసుకున్నారు. కాగా 3.1 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గో నలేదని, కమిషన్ తన నివేదికలో తెలిపింది.
కాగా ఈ కులగణన నివేదికపై సోమవారం కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం దానికి ఆమోదం తెల పనుంది. అనంతరం నివేదికను రెడీ చేసి ఈ నెల 5న ఉదయం జర గనున్న కేబినెట్ సమావేశంలో ప్రవే శపెడ తారు. అక్కడ ఆమోదించిన తర్వా త అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వ హించి ఈ కులగణన నివేదికను ప్రవేశపెట్టను న్నారు.అనంతరం కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహిం చిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ఇం టింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కోసం ఉత్తర్వులు ఇచ్చింది.
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కు లగణన సర్వే చేయించి విజయవం తంగా పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన దిశగా కులగణన సర్వే నివేదిక ఆమోదం తో ముందడుగు పడనుంది. కాగా ఈ నివేదిక త్వరలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కులగణన సర్వేలోని ముఖ్యాం శాలు ….రాష్ట్ర జనాభాలో 96.9 0 శాతం మంది కులగణన సర్వేలో పాల్గొన్నారు.సర్వేలో పాల్గొనని జ నాభా 3.10 శాతం.వివరాలు ఇచ్చి న కుటుంబాల సంఖ్య 1,12,15, 131వివరాలు అందించిన వారి 3,54,77,554 సంఖ్యగా ఉంది.
–బీసీల జనాభా 46.25 శాతం
–ఎస్సీల జనాభా 17.43 శాతం
–ఎస్టీల జనాభా 10.45 శాతం
–ముస్లిం మైనారిటీల బీసీల జనా భా 10.08 శాతం
–ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
–ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
–మొత్తం ముస్లిం మైనారిటీల జనా భా 12.56 శాతం
–మొత్తం ఓసీల జనాభా 15.79 శాతంగా నిర్ధారించారు.