Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: సాగర్ ఎడమ కాల్వ గండి వారంలో పూర్తి చేస్తాం..

– రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

 

ప్రజా దీవెన, కోదాడ:

Uttam Kumar Reddy: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువ (Left canal) గండి (Hole)ని వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ (Irrigation Department) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. రాత్రి పగలు పనిచేసే గండిని పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడింది.

 

దీంతో గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనుల (Repair work)ను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గండి పూడ్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం 2.10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాలువలు చెరువులు పంప్ హౌస్‌లను మరమ్మత్తులు చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరద నష్టాన్ని కేంద్రానికి నివేదిక అందించామన్నారు. కేంద్ర సహాయం కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికను పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్ర సాయం (Central assistance) సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఎడమ కాల్వ వెంబడి చాలా చోట్ల కాల్వ లైనింగ్, కట్టలు కోతకు గురికావడంతో వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గారపల్లి మేజర్‌ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల మేర లైనింగ్‌ దెబ్బతిన్నది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కహిరా రామచంద్రాపురం గ్రామాల సమీపంలో కాలువ కట్టలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.