Uttarakhand Floods: అతివృష్టితో ఆగమాగం
–హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్‌తో కుంభవృష్టి
–45 మంది గల్లంతు, ఐదుగురి దుర్మరణం
–ఉత్తరాఖండ్‌లో రాత్రివేళ పోటెత్తిన వరద
–రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి
–వరదనీటిలోనే ఢిల్లీ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు
–రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు ముగ్గురి మృతి
–11 రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ
Uttarakhand Floods:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో అ తివృష్టితో ఆగమాగం అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్‌తో (With cloud burst in Himachal Pradesh) కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు (Houses, bridges, roads)కొట్టుకుపోయా యి. దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శ్రీఖండ్ మహదేవ్ సమీపంలో బుధ వారం రాత్రి క్లౌడ్ బరస్ట్‌తో సర్పారా, గాన్వీ, కుర్బన్ నల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. పార్వతి నదిపై మలానా డ్యామ్ కొట్టుకుపో యి దిగువ ప్రాంతాలను నీరు ముం చెత్తింది. శిమ్లా జిల్లా రాంపూర్‌లోని సమేజ్‌ఖడ్‌లో 30 మంది కొట్టుకు పోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. మండి జిల్లా తెరాంగ్ సమీపంలోని రాజ్‌బన్ గ్రామం వద్ద మరో క్లౌడ్ బరస్ట్ జరిగింది.
కులు జిల్లాలో ఏడుగురు కొట్టుకు పోయారు. మలానా జల విద్యుత్ కేంద్రం లో పలు వురు చిక్కుకుపోయారు. బియాస్ నది ఉధృతి, కొండచరియ లు విరిగిపడడంతో కీలకమైన మనాలీ, చండీగడ్ జాతీయ రహ దారి (Chandigarh National Highway)పలుచోట్ల తీవ్రంగా దెబ్బతి న్నది. హిమాచల్ సీఎం సుఖుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని. అడిగి తెలుసుకు న్నారు. కాగా, రాష్ట్రంలోని పాలం పూర్, చౌరీలో 21 సెంటీమీటర్ల పరపాతం నమోదైంది. దర్మశాల (18 సెం.మీ.) సహా పలు ప్రాంతాల్లో 105 పైగా సెం.మీ. వర్షం పడింది. కంగ్రా, కులు, మండిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్ అల ర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షా లతో రాత్రికి రాత్రే పరద పోటె త్తింది. పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12 మంది మృతి చెందారు.
హిమాచల్ లో ఎన్టీఆ ర్ఎఫ్, ఎన్టీఆ ర్ఎఫ్, సైన్యం, స్థానిక సులు (NTA RF, NTA RF, Army, Locals)సహా యక చర్యలు చేపట్టా రు. దేశ రాజ ధాని ఢిల్లీ లోని చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఆ రుచోట్ల ఒక్క రోజులోనే 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. వివిధ ఘటనల్లో ఐదుగురు చనిపోయిన ట్లు అది కారులు తెలిపారు. 12 ఏళ్ల బాలుడు, 26 ఏళ్ల యువకుడు విద్యు దాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంట్లోకి వరద చేరడంతో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతిచెందారు. హిమా చల్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గోవాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్, హిమాచల్లో ఎన్టీఆ ర్ఎఫ్, ఎన్టీఆ ర్ఎఫ్, సైన్యం, స్థానిక సులు సహాయక చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ లోని చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నా యి. ఆరుచోట్ల ఒక్క రోజులోనే 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైం ది. వివిధ ఘటనల్లో ఐదుగురు చనిపోయినట్లు అదికారులు తెలిపారు. 12 ఏళ్ల బాలుడు, 26 ఏళ్ల యువకుడు విద్యు దాఘాతం తో ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంట్లోకి వరద చేరడంతో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతిచెం దారు. హిమాచల్, పంజాబ్, హరి యాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహా రాష్ట్ర, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.