–స్వర్గీయ వాజ్ పేయి జయంతి వేడుకల్లో నేతల మధ్య జగడం
–కొద్దిసేపు షార్ట్ ఫిలిం తరహాలో రక్తికట్టించిన ఉద్రిక్త వాతావరణం
–బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పిల్లి రామరాజు ఫైర్
–మరోవైపు పోటో జర్నలిస్టుల ఆం దోళనతో ఆఫీసులో రణరంగం
–నాగం వర్షిత్ రెడ్డి నశించాలంటూ జర్నలిస్టుల బైఠాయింపు
–ఎట్టకేలకు క్షమాపణలతో చల్లబ డిన బీజేపీ కార్యాలయం
Vajpayee’s birth anniversary celebrations: ప్రజా దీవెన, నల్లగొండ: అంతర్గతం గా ఎలాఉన్నా బాహ్యప్రపంచానికి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే భారతీయ జనతా పార్టీలో ముస లం పుట్టింది. నల్లగొండ బీజేపీలో గ తకొంత కాలంగా స్తబ్దుగా ఉన్న అం తర్గత కలహాలు ఒక్కసారిగా బ హి ర్గతమయ్యాయి. నేతల మధ్య వై రుధ్యాలు చికిలి చిలికి గాలివాన లా మారాయి. గురువారం నల్లగొం డ జిల్లా బిజెపి కార్యాలయంలో నే తలు బాహాబాహీకి దిగారు. బీజేపీ మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకల సందర్భంగా పార్టీ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్‌ల మధ్య కోల్డ్ వార్ ఘర్షణ వాతావరణంకు దారితీసింది.

పార్టీ కార్యక్రమం నిర్వహణలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మరో నాయకుడు పిల్లి రామరాజు మధ్య నెలకొన్న బేధాభిప్రాయం కా స్తా నాగం అనుచరుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రెడ్డి ఏకంగా పిల్లి రామరాజు యాదవ్ పై దాడికి దిగే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాగం వర్షిత్ రెడ్డి ఈ దాడిని అడ్డుకునే ప్రయ త్నం చేయకపోగా మోహన్ రెడ్డికి మద్దతు పలికాడని రామరాజు యాదవ్ ఆరోపించడం గమనార్హం.

ఓ విధంగా షార్ట్ ఫిలిం తరహాలో బీజేపీ జిల్లా కార్యాలయంలో గు రువారం చోటుచేసుకున్న ఘటన మొత్తానికి రక్తికట్టించిoదని చెప్పవ చ్చు. బీజేపీ కార్యాలయంలో జరిగి న తాజా ఎపిసోడ్ కథాకమీషు ఇ లా ఉంది. మాజీ ప్రధాని వాజ్ పే యి జయంతి సందర్భంగా జిల్లా పా ర్టీ కార్యాలయంలో ఇటీవల బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప స ర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్ర మం నిర్వహించాలని పార్టీ జిల్లా అ ధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అను మతితో పిల్లి రామరాజు యాదవ్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ విషయంలో అనుకున్న కార్యక్ర మాన్ని రద్దు చేసుకోవాలంటూ బు ధవారం అర్ధరాత్రి నాగం వర్షిత్ రెడ్డి ఫోన్ చేసి ఆదేశించాడని పిల్లి రా మరాజు యాదవ్ ఆరోపిస్తున్నారు. అయితే గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో వాజ్ పేయి జ యంతి వేడుకలు నిర్వహిస్తున్న స మయంలోనే నాగం వర్షిత్ రెడ్డి మాత్రం సర్పంచులకు సన్మాన కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పాడ ని పిల్లి రామరాజు చెబుతున్నారు. తనను సన్మాన కార్యక్రమం నిర్వ హించవద్దని చెప్పి మీరిప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవుల మాటలయుద్ధo ప్రారం భమైంది.

ఈ క్రమంలో నాగం వర్షిత్ రెడ్డి తర పున వకాల్తా పుచ్చుకున్న జిల్లా పా ర్టీ ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రె డ్డి మధ్యలో కలుగజేసుకొని రామ రాజు యాదవ్ పై ఉన్నపళంగా భౌ తిక దాడికి దిగారు. దీంతో తనపై జరిగిన దాడితో అవాక్కయిన పిల్లి రామరాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా పార్టీ కార్యాల యంలో తన అనుచరులతో ఆందో ళనకు దిగారు.

నల్లగొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి పెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి 28 వేల ఓట్లను తెచ్చుకున్నానని గుర్తు చేస్తూ బీజేపీపై ఉన్న అభిమానంతో తో పార్టీలో చేరానని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలోనే బైటాయించిన పిల్లి రామరాజు ఆ గ్ర హంతో ఊగిపోతూ అయితే నాగం వర్షిత్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్య తల నిర్వహణలో పూర్తిగా విఫల మయ్యాడని ఆరోపణలు గుప్పిస్తూ తాను తలచుకుంటే క్షణాల్లో ప్రతి దాడికి దిగగలుగుతానని ఛాలెంజ్ చేస్తూ పార్టీ నాయకులను హెచ్చరిం చారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీ కో సం కష్టపడే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ మాటల యుద్ధం కొనసాగిం చాడు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తనకు ఎవరు పోటీ ఉండొద్దన్న దు రుద్దేశంతో బలమైన పార్టీ నాయకు లను కట్టడి చేయాలన్న వర్షిత్ రెడ్డి దూరం పెడుతున్నాడని ఆరోపిం చారు. తనపై దాడి చేసిన ఫకీర్ మోహన్ రెడ్డి పార్టీ నాయకుల స మక్షంలో తనకు క్షమాపణ చెప్పేంత వరకు తన ఆందోళనను విరమిం చే ది లేదని పార్టీ కార్యాలయంలోనే పి ల్లి రామరాజు యాదవ్ చాలా సేపు పట్టుబడుతూ బైఠాయించారు.
*ఫోటో, వీడియో జర్నలిస్టుల నిరసన..*
బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతల మధ్య బాహాబాహీ విషయంలో నెల కొన్న వాతావరణం ఫోటో జర్నలిస్టు ల నిరసనలతో మరింత వేడెక్కింది. నేతల మధ్య బాహాబాహీకి సంబం ధించిన ఫోటోలను చిత్రీకరించిన ఫోటో, వీడియో జర్నలిస్టులతో బీజే పీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రె డ్డి వ్యవహరించిన తీరు వివాదా ని కి దారితీసింది. పార్టీ నేతల ఘర్షణ వాతావరణం సమయంలో అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఈ గొడవను రికార్డు చేయగా నాగం వర్షిత్ రెడ్డి మీడియా ప్రతినిధి నుం చి బలవంతంగా చేసి కెమెరాను గుంజుకొని చిప్‌ను ఫార్మాట్ చేయ డం పెద్ద గందరగోళానికి దారితీ సిం ది.
దీంతో నాగం వర్షిత్ రెడ్డి వ్యవహార శైలిని నిరసిస్తూ మరోవైపు జర్నలి స్టులు తమపై జరిగిన దాడిని నిరసి స్తూ కార్యాలయం మెయిన్ గేటు వ ద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహిం చారు. ఒకవైపు పార్టీ నేతల మధ్య వివాదం, మరోవైపు జర్నలిస్టులు ఆందోళనలతో చేపట్టడంతో బీజేపీ కార్యాలయం కొద్దిసేపు రణరంగo గా మారింది. ఈ క్రమంలో పోలీసు లు రంగప్రవేశం చేసి పరిస్థితిని అ దుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఎట్టకేలకు షార్ట్ ఫిలిం తరహా ఎపిసోడ్ కు తెరపడడoతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.